Video | గచ్చిబౌలి బయోడైవర్సీటీ ప్లైవోవర్ పై నుండి కింద పడిన కారు.. ఒకరు మృతి

గచ్చిబౌలిలో శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బయోడైవర్సీటీ ప్లైవోవర్ పై నుండి వేగంగా వెళ్తున్న ఓ కారు అంతే వేగంతో దూసుకెళ్లి కిందున్న మరో రోడ్డు పక్కన పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ మృతి చెందగా కారులో ఉన్న వారితో పాటు పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఘటనస్థలంలో రోడ్డుకి ఆనుకుని ఉన్న వ్యాపార సముదాయ భవనాల్లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ రోడ్డు ప్రమాదం పూర్తిగా రికార్డైంది. ఊహించని పరిణామానికి షాకైన ప్రత్యక్షసాక్షులు అక్కడి నుంచి పరుగులు తీయడం ఈ వీడియోలో చూడొచ్చు.

Last Updated : Nov 23, 2019, 05:35 PM IST
Video | గచ్చిబౌలి బయోడైవర్సీటీ ప్లైవోవర్ పై నుండి కింద పడిన కారు.. ఒకరు మృతి

హైదరాబాద్: గచ్చిబౌలిలో శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బయోడైవర్సీటీ ప్లైవోవర్ పై నుండి వేగంగా వెళ్తున్న ఓ కారు అంతే వేగంతో దూసుకెళ్లి కిందున్న మరో రోడ్డు పక్కన పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ మృతి చెందగా కారులో ఉన్న వారితో పాటు పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఘటనస్థలంలో రోడ్డుకి ఆనుకుని ఉన్న వ్యాపార సముదాయ భవనాల్లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ రోడ్డు ప్రమాదం పూర్తిగా రికార్డైంది. ఊహించని పరిణామానికి షాకైన ప్రత్యక్షసాక్షులు అక్కడి నుంచి పరుగులు తీయడం ఈ వీడియోలో చూడొచ్చు.

వారం రోజుల వ్యవధిలోనే గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Trending News