Asaduddin Owaisi: హైదరాబాద్‌లో వర్షాలు, వరదలు.. సాయం కోరుతూ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్
Asaduddin Owaisi Tweet Over Hyderabad Rains and Floods | టాలీవుడ్ నటీనటులు, దర్శకులు, ఇతర మూవీ యూనిట్ వర్గాలు తమ వంతు సాయాన్ని విరాళాల రూపంలో ప్రకటించారు. హైదరాబాద్ వరదలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు.
భాగ్యనగరం, విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ కష్టాల కన్నీటిలో కొట్టుమిట్టాడుతోంది. వేల ఇళ్లు నీట మునిగాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలు (Hyderabad Rains), దాంతో వచ్చిన వరద నీరు ఎందరి బతుకులనో మార్చివేసింది. ఇప్పటికీ పలు కాలనీలు, ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయంటే భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావం హైదరాబాద్‌పై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలిచారు.
టాలీవుడ్ నటీనటులు, దర్శకులు, ఇతర మూవీ యూనిట్ వర్గాలు తమ వంతు సాయాన్ని విరాళాల రూపంలో ప్రకటించారు. హైదరాబాద్ వరదలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు. కేవలం మీరు మీకు తోచినంత విరాళం ప్రకటించడంతో పాటు ఇతరులకు కూడా సాయం అందించాలని సూచించాలని కోరారు. హైదరాబాద్‌లో ప్రస్తుత పరిస్థితికి అక్బరుద్దీన్ ఒవైసీ ట్వీట్ నిదర్శనంగా మారింది.
‘గత 100 సంవత్సరాల చరిత్రలో హైదరాబాద్‌లో ఇంతలా వర్షాలు ఎప్పుడూ కురవలేదు. భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు మీ వంతు సాయం చేయడానికి ముందుకు రండి. మన అందరి సాయం హైదరాబాద్ వర్షాల బాధితులకు (#HyderabadRains) అవసరం. తక్షణమే బాధితులకు కొంతమేర సాయం అందాలంటే మీరు తోచిన విరాళాలు అందించడంతో పాటు ఇతరులను సైతం సాయం చేయాలని కోరాలంటూ’ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Hyderabad MP Asaduddin Owaisi) తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ మేరకు ఓ వీడియోను అసదుద్దీన్ ఒవైసీ షేర్ చేశారు. ఈ ఖాతాకు విరాళాలు అందజేయాలని ఆయన కోరారు.
మజ్లిస్ చారిటి ఎడ్యుకేషన్ అండ్ రిలీఫ్ ఫండ్ ట్రస్ట్
దారుసలాం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్
బ్యాంక్ అకౌంట్ నెం: 1001101000001397
IFSC CODE: HDFC0CDUCBL
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe