MLA Prakash Goud Big Twist To CM Revanth Reddy: ఎన్నికలు దగ్గపడుతున్న కొలది తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. ఏ పార్టీలో ఎవరుంటారో.. ఎవరు మరో పార్టీలోకి చేరిపోతారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న ఒక పార్టీలో ఉన్న వారు.. ఈరోజు మరో పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటే.. రాత్రి మాట్లాడిన వాళ్లు ఉదయం పార్టీలో ఉంటాడా.. మరో పార్టీలోకి జంప్ అయిపోతాడో.. అన్న అనుమానలు వచ్చేవిధంగా మారిపోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవల గ్రేటర్ లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా.. ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: V Hanumanth Rao: భట్టి నాపై పగబట్టిండు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వీ హనుమంత్ రావు..


రానున్న.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచి సీఎం రేవంత్ సర్కారు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కు పరిమితమైంది. బీఆర్ఎస్ కు హైదరాబాద్ కు తొలిస్థానంలో సీట్లు రాగా, ఆ తర్వాత బీజేపీ నిలిచింది. కాంగ్రెస్ కు మూడో స్థానంలో పరిమితమైంది. ఇదిలా ఉండగా.. గ్రేటర్ పరిధిలో రాజేంద్ర నగర్ కు చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ ను కలిశారు. మాజీసీఎం కేసీఆర్ తెలంగాణలో బహిరంగ సభను ఏర్పాటు చేసిన రెండో రోజు ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ ను కలువడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఈ క్రమంలోనే ఆయన తాజాగా తన నియోజక  వర్గం కార్యకర్తలతో సమావేశ మయ్యారు. దీనిలో పార్టీ మారితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆయనకు కొంత మంది చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ లోకి చేరడంలేదని ప్రకటించారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ప్రకాష్ గౌడ్ ప్రకటించారు. దిలా ఉండగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి వలసలు తీవ్రంగా కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటీకే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు, కడియం శ్రీహరి,కే కేశవరావు, దానంనాగేందర్ వంటి సీనియర్ లీడర్లు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు.


Read More: Heavy Rainfall In Hyderabad: చల్లబడిన భాగ్య న'గరం'.. పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం.. పవర్ కట్..


సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ గెట్లు ఎత్తితే అనేక మంది బీఆర్ఎస్ లీడర్లు జాయిన్ అవ్వడానికి పరిగెత్తుకుంటూ వస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నట్లుగానే.. బీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి మరీ కాంగ్రెస్ లోకి చేరిపోయారు. ఇక.. బీఆర్ఎస్ మాత్రం వెళ్లిపొయిన నేతలు.. మరల కాళ్లుపట్టుకుని వెంటపడిన రానివ్వమంటూ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా.. కేసీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడినప్పుడు.. కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి రావడానికి రెడీగా ఉన్నారంటూ కొత్త రాగం మొదలుపెట్టారు. దీంతో ఇది ఒక్కసారిగా పొలిటికల్ సర్కిల్స్ లో రాజకీయా దుమారంగా మారిన విషయం తెలిసిందే.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter