Heavy Rainfall: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయంబైటకు వెళ్లాలన్న కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో వాతావరణ కేంద్రం తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. వాతావరణ కేంద్రం చెప్పిన విధంగానే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.
కొన్నిరోజులుగా సూర్యుడి భగ భగ మండిపోతున్నాడు. దీంతో సాధారణం జీవనంమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. బయటకు వెళ్లాలంటేనే జనాలు వణికిపోతున్నారు. ఉదయం పదినుంచి సాయంత్ర మూడు వరకు ఎవరు కూడా బైటకు వెళ్లడానికి అస్సలు ధైర్యం చేయడంలేదు.
ఖచ్చితంగా అవసరమున్న వారే ఉద్యోగాలు, వ్యాపారాలుచేసుకుంటున్న వారు మాత్రమే బైటకు వెళ్తున్నారు. ఇక బైటకు వెళ్లిన కూడా గొడుగులు, ఫ్రూట్ జ్యూస్ లు వంటివి ఉపయోగించి వేసవితాపం నుంచి బైటపడే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక వాతావరణ కేంద్రం తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది. రానున్నమూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలుకురుస్తాయని తెలిపింది. అంతేకాకుండా తెలంగాణకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో అనేక జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
తెలంగాణలోని జనగాం,వరంగల్, సిద్ధిపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ను జారీచేసింది. ఉరుములు , మెరుపులతో బలమైన గాలలు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక. హైదరాబాద్ లో శనివారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది.
ముఖ్యంగా హైదరాబాద్ లోని..కొత్తపేట, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్,రాజేంద్ర నగర్, తుర్కయాంజిల్, అమీర్ పేట వంటి ప్రాంతాలలో మెరుపులు, ఉరుములతో వర్షం పడింది. అంతేకాకుండా నగరం అంతా ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ప్రజలు అంతా ఎండనుంచి ఉపశమనం దొరికిందని భావిస్తున్నారు.
మరోవైపు రైతులు వడగండ్ల వర్షాలు, అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన వడ్లు తడిసిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెడగొట్టు వర్షాల వల్ల తాము ఎంతో నష్టపోయామంటూ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఎండతో ఉక్కిరిబిక్కిరిగా మారిన ప్రజలకు వర్షం కాస్తంతా ఊరటనిచ్చిందని చెప్పుకొవచ్చు.