App for Drugs: డ్రగ్స్ సరఫరాకు ప్రత్యేక యాప్, యాప్స్ రిజిస్ట్రేషన్, సభ్యుల వివరాలపై ఆరా తీస్తున్న పోలీసులు
App for Drugs: హైదరాబాద్ పబ్స్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రత్యేక యాప్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేయడం ఆందోళన కల్గిస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
App for Drugs: హైదరాబాద్ పబ్స్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రత్యేక యాప్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేయడం ఆందోళన కల్గిస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కల్గించిన రాడిసన్ పబ్ వ్యవహారం అనేక కొత్త విషయాలకు దారితీస్తోంది. కోడ్ ఉంటేనే పబ్స్‌లో ప్రవేశం కల్పించేలా పగడ్బంధీ ఏర్పాట్లతో డ్రగ్స్ పంపిణీ చేస్తుండటం హైదరాబాద్ పోలీసుల నిఘాతో బట్టబయలైంది. 24 గంటలు మద్యం ఇస్తాం.. కావాలంటే డ్రగ్స్ తెప్పిస్తామంటూ పుడింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకులు యువతను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లు ఇచ్చారని తెలుస్తోంది. పబ్‌లోకి ప్రవేశించాలంటే..ముందుగా యాప్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. పరిశీలించాక ఒక్కొక్కరికి ఒక్కో కోడ్ నంబరు కేటాయిస్తారు. అది నమోదు చేస్తేనే లోపలికి అనుమతిస్తారు.
డ్రగ్స్ అవసరమైన వారి కోసం ప్రత్యేక యాప్ రూపొందించారు. పబ్ మేనేజర్ అనిల్‌కుమార్ దానిని నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. పార్టీల్లో ఉపయోగించే ఎల్‌ఎస్‌డీ, హెరాయిన్, ఎండీఎంఏ వంటివాటిలో ఏది కావాలి.. ఎంత మోతాదు కావాలనే వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. ఫోన్ నంబర్లకు పంపిన ఓటీపీలను నిర్ధారించుకున్నాక మాదకద్రవ్యాలు అందజేస్తారని పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా కోసం ప్రత్యేకంగా యాప్ కూడా అభివృద్ధి చేయడం కలకలం రేపుతోంది.
పబ్ కేసులో యాప్స్ రిజిస్ట్రేషన్, యాప్ ఓటీపీ వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎవరు డ్రగ్స్ వాడారు? సరఫరా చేసింది ఎవరు అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. పబ్‌లో డివిఆర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సిసి పుటేజ్ కీలకం కానుంది. ప్రత్యేక పబ్ యాప్ సభ్యుల డేటా సేకరిస్తున్నారు పోలీసులు. యాప్ ఓటీపీ, రిజిస్ట్రేషన్‌పై ఆరా తీస్తున్నారు. విఐపి సర్కిల్‌కు మాత్రమే ప్రత్యేక కోడ్ వార్డ్స్‌తో ఆహ్వనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానితులను గుర్తించి రక్తం, వెంట్రుకలు షాంపిల్స్ సేకరించనున్నారు పోలీసులు. ఇందుకోసం కోర్టు అనుమతి కోసం పిటీషన్ వేయనున్నారు.
ఇప్పటికే ఈ కేసులో పబ్ నిర్వాహకులు అనిల్, అభిషేక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. పరారీలో ఉన్న పార్టీ నిర్వాహకుడు అర్జున్ వీరమాచినేని కోసం గాలిస్తున్నారు.ఈవెంట్ మేనేజర్ కునాల్, డీజే శశిధర్‌రావుల కీలకపాత్ర పోషించినట్టు అనుమానం. పబ్‌లో లభించిన శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపింది క్లూస్ టీమ్. కొకైన్ డ్రగ్స్‌గా నిర్దారించారు.
Also read: Hyderabad Drugs: కోడ్ చెబితేనే పబ్‌లోకి ఎంట్రీ.. మప్టీలో వెళ్లి పోలీసుల ఆపరేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook