Hyderabad Drugs: కోడ్ చెబితేనే పబ్‌లోకి ఎంట్రీ.. మప్టీలో వెళ్లి పోలీసుల ఆపరేషన్

Hyderabad Drugs: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా కలకలం సృష్టిస్తోంది. రాజధాని నగరంలో మత్తుమందు సరఫరాకు కొత్త మార్గాలు ఎంచుకుంటోంది మాఫియా. కొన్ని పబ్స్‌లో అంత ఈజీగా ప్రవేశించలేరు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 4, 2022, 08:45 AM IST
Hyderabad Drugs: కోడ్ చెబితేనే పబ్‌లోకి ఎంట్రీ.. మప్టీలో వెళ్లి పోలీసుల ఆపరేషన్

Hyderabad Drugs: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా కలకలం సృష్టిస్తోంది. రాజధాని నగరంలో మత్తుమందు సరఫరాకు కొత్త మార్గాలు ఎంచుకుంటోంది మాఫియా. కొన్ని పబ్స్‌లో అంత ఈజీగా ప్రవేశించలేరు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన రాడిసన్ హోటల్ పబ్ వ్యవహారంలో పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. పబ్‌లో పోలీసుల తనిఖీలు లేవని తెలుస్తోంది. 24 గంటలు మద్యం ఇస్తాం.. కావాలంటే డ్రగ్స్ తెప్పిస్తామంటూ పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ నిర్వాహకులు యువతను ఆకట్టుకునేందుకు ఆఫర్లు ఇచ్చారని తెలుస్తోంది. పబ్‌లోకి ప్రవేశం అంత ఈజీగా లేదు. ముందుగా యాప్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. పరిశీలించాక ఒక్కొక్కరికి ఒక్కో కోడ్‌ నంబరు కేటాయిస్తారు. అది నమోదు చేస్తేనే లోపలికి అనుమతిస్తారు. 

డ్రగ్స్ అవసరమైన వారి కోసం ప్రత్యేక యాప్‌ రూపొందించారు. పబ్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌ దానిని నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. పార్టీల్లో ఉపయోగించే ఎల్‌ఎస్‌డీ, హెరాయిన్‌, ఎండీఎంఏ వంటివాటిలో ఏది కావాలి.. ఎంత మోతాదు కావాలనే వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. ఫోన్‌ నంబర్లకు పంపిన ఓటీపీలను నిర్ధారించుకున్నాక మాదకద్రవ్యాలు అందజేస్తారని పోలీసులు గుర్తించారు.   

రాడిసన్ పబ్‌పై పోలీసుల దాడి పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. శనివారం అర్ధరాత్రి పబ్‌లో డీజే జోరులో పార్టీ హోరెత్తిపోతోంది. దీంతో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట టాస్క్‌ఫోర్స్‌ విభాగాలకు చెందిన ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు సీఐలు, 100 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. మొదట కొందరు కానిస్టేబుళ్లను మఫ్టీలో లోపలికి పంపారు. అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ తీసుకొని పబ్‌లోకి వచ్చారు. వాటిని పొట్లాలుగా మార్చి చీకట్లోనే కొందరి చేతికిచ్చారు. అది ఇంకొందరి చేతులు మారింది. అప్పటికే అక్కడ మారువేషంలో ఉన్న పోలీసులు మత్తుమందు ఎవరెవరి చేతులు మారుతోందో గమనించారు. బయట కాపలా ఉన్న తోటి పోలీసులను అప్రమత్తం చేశారు. వారు లోపలికి ప్రవేశించటంతో మాదకద్రవ్యాల పొట్లాలు చేతిలో ఉన్న యువతీ, యువకులు ఆందోళనకు గురయ్యారు. ఏం చేయాలో పాలుపోక వాటిని కింద పారేశారు. వాటిలో ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, ఎండీఎంఏ, హెరాయిన్‌ ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో పబ్‌లో ఉన్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన 148 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కౌన్సెలింగ్‌ ఇచ్చి సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.

Also read: Hyderabad Drugs Case: ఆ పబ్‌తో నా కూతురికి సంబంధం లేదు... రేణుకా చౌదరి రియాక్షన్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News