Hyderabad Rain: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మంగవారం వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ కుండపోత వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బోరబండి, మోతీనగర్, ఎస్సార్ నగర్, అమీర్ పేట, ఎర్రగడ్డ, యూసుఫ్ గూడా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల రూడ్లపై వరదనీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముఖ్యంగా మాదాపూర్ చౌరస్తాలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోడ్లపై నిలిచిన నీళ్లను క్లియర్ చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, అల్వాల్, బోయిన్ పల్లి, సుచిత్ర ఏరియాల్లో పట్టపగలే ఎండతోపాటు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలో విచిత్ర వాతావరణం ఏర్పడింది. అటు పగటి పూట ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


 






Also Read: Bathukamma 2024: మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..?


ఇక గత వారం పది రోజులుగా ప్రతిరోజూ ఏదొక చోట వర్షం కురుస్తూనే ఉంది. ముఖ్యంగా సాయంత్రం హైదరాబాద్ లో వర్షం పడుతుంది. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. గత నాలుగు నెలల కాలంలో 30శాతం అధికంగా వర్షం పడినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. 


 


Also Read: Dusshera: నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు దసరా కానుక.. పోలీస్‌ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook