Hyderabad Police issues Traffic Restrictions in Hyderabad due to New Year 2023 Celebrations: మరోకొన్ని గంటల్లో కొత్త సంవత్సరం 2023 రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధం అవుతోంది. ఇక హైదరాబాద్‌ నగరం కూడా కొత్త సంవత్సరం వేడుకలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే పబ్స్, రెస్టారెంట్స్, హోటల్స్, మాల్స్ అన్ని విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్నాయి. అయితే న్యూయర్‌ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు హైదరాబాద్ నగర పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని నగర పోలీసులు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ‌నివారం (2022 డిసెంబర్ 31) రాత్రి 10 నుంచి ఆదివారం (2023 జనవరి 1) తెల్ల‌వారుజామున 2 గంట‌ల వ‌ర‌కు హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయని పోలీసులు తెలిపారు. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లై ఓవ‌ర్ల‌ను మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే బేగంపేట్, లంగ‌ర్ హౌజ్ ఫ్లై ఓవ‌ర్లు మాత్రం తెరిచి ఉంటాయ‌ని చెప్పారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్‌ బండ్ వైపు వాహ‌నాల‌ను అనుమ‌తించ‌మ‌ని పోలీసులు స్పష్టం చేశారు. హుస్సేన్ సాగ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపారు.


వీవీ స్టాచ్యూ, రాజ్ భ‌వ‌న్ రోడ్, బీఆర్కే భ‌వ‌న్‌, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు త‌ల్లి జంక్ష‌న్, ఇక్బాల్ మినార్, లిబ‌ర్టీ జంక్ష‌న్, ల‌క్డీకాపూల్‌, అప్ప‌ర్ ట్యాంక్ బండ్, ర‌వీంద్ర భార‌తి, ఖైర‌తాబాద్ మార్కెట్, అంబేద్క‌ర్ స్టాచ్యూ, నెక్లెస్ రోట‌రీ, రాజ్‌దూత్ లేన్, న‌ల్ల‌గుట్ట రైల్వే బ్రిడ్జి, సెన్‌సెష‌న్ థియేట‌ర్, సంజీవ‌య్య పార్క్, పీవీఎన్ఆర్ మార్గ్, సైలింగ్ క్ల‌బ్, క‌వాడిగూడ ఎక్స్ రోడ్,  మినిస్ట‌ర్ రోడ్, లోయ‌ర్ ల్యాంక్ బండ్, క‌ట్ట‌మైస‌మ్మ టెంపుల్,ఆర్టీసీ ఎక్స్‌రోడ్,  అశోక్ న‌గ‌ర్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని హైదరాబాద్‌ నగర పోలీసులు తెలిపారు.  మింట్ కంపౌండ్ ర‌హ‌దారిని కూడా మూసివేయ‌నున్నారు. 


బ‌స్సులు, ట్ర‌క్కులతో పాటు ఇత‌ర వాహ‌నాల‌ను శనివారం రాత్రి 2 గంట‌ల వ‌ర‌కు హైద‌రాబాద్‌లోకి అనుమ‌తి లేదని నగర పోలీసులు తెలిపారు. హైద‌రాబాద్‌ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు ముమ్మరంగా జ‌రుగుతాయ‌ని వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు అన్నారు. మద్యం సేవించిన వారి కోసం అర్థరాత్రి వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయని, వాహనాలను ఎట్టిపరిస్థితులలో నడపరాదని హెచ్చరించారు. 


Also Read: Rishabh Pant Car Accident: మన్సూర్ పటౌడీ నుంచి ఆండ్రూ సైమండ్స్ వరకు.. రోడ్డు ప్రమాదంకు గురైన క్రికెటర్లు వీరే!  


Also Read: Cheap Hyundai Creta Cars: రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ లేదు.. రూ. 7 లక్షలకే హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.