10 more days of traffic jams in Hyderabad due to Formula E Race Hyderabad: హైదరాబాద్‌ వాహనదారులు గత మూడు రోజులుగా ముప్పుతిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా బుధవారం అయితే ట్రాఫిక్‌ సమస్య తీవ్రరూపం దాల్చింది. ట్రాఫిక్ మల్లింపుల కారణంగా ఉదయం 9 నుంచి రాత్రి 11 వరకు వరకు రోడ్లపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఆఫీస్, ఇంటికి వెళ్లేవారు గంటల కొద్ది ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. దాంతో వాహనదారులు గమ్యం చేరేందుకు ఆపసోపాలు పడ్డారు. ఎటుచూసినా ట్రాఫిక్‌ జామ్‌ ఉండడంతో.. రోడ్డు దాటేందుకు పాదచారులకు కూడా కష్టమైపోయింది. నగర వాసులకు ఈ ఇబ్బందులు మరో 10 రోజుల పాటు తప్పేలా లేవు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌ నగరం వచ్చే 7-10 రోజులు రద్దీగా ఉండనుంది. ఒకవైపు శాసనసభా సమావేశాలు ఉండగా.. మరోవైపు ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ రేసింగ్‌ మొదలవనుంది. ఫార్ములా-ఈ రేసింగ్‌ కోసం ఇప్పటికే దారి మల్లింపులతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. ఇక ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్‌ జరగనుండగా.. ఫిబ్రవరి 17న నూతన సచివాలయం ప్రారంభం ఉంది. ఇక ఫిబ్రవరి 18న శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. దాంతో రానున్న 10 రోజుల పాటు నగరంలో వాహనదారులు నరకం చవిచూడక తప్పదు. ట్రాఫిక్‌ పోలీసులు 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్నా.. పరిస్థితి మాత్రం అదుపులో ఉండడం లేదు. 


భాగ్యనగరంలో 80 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. అందులో 30-40 లక్షలు నిత్యం రోడ్లపై తిరుగుతుంటాయి. రద్దీ కారణంగా ఉదయం, సాయంత్రం సమయంలో 10 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 30-40 నిమిషాలు పడుతోంది. అయితే గత 2-3 రోజులుగా కిలోమీటరు దూరానికే 50-60 నిమిషాలు పడుతోందంటూ వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాసబ్‌ట్యాంక్‌ నుంచి ఖైరతాబాద్‌కు 45 నిమిషాలు సమయం పట్టిందంటూ ఒకరు చెప్పారు. ట్రాఫిక్‌ సమస్య మరింత పెరిగేందుకు నిబంధనల ఉల్లంఘనులే ప్రధాన కారణమని పోలీసులు అంటున్నారు. నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిపై ప్రతిరోజూ సుమారు 17000 చలానాలు నమోదవుతుంటాయి. 


ఫిబ్రవరి 11న అంతర్జాతీయస్థాయిలో జరిగే ఫార్ములా-ఈ రేసింగ్‌ పోటీలకు 21,000 మందికి పైగా వస్తారని అధికార్లు అంచనా వేశారు. రేసింగ్‌ నిర్వహించే ఎన్టీఆర్‌మార్గ్‌, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పరిసర ప్రాంతాలను ఇప్పటికే పూర్తిగా మూసివేశారు. ఇక రేసింగ్‌ జరిగే రోజు సికింద్రాబాద్‌-ట్యాంక్‌బండ్‌ వైపు మార్గాలను కూడా మూసేస్తారు. శని, ఆదివారాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు అదనంగా 500-600 మందిని రంగంలోకి దింపేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు.


Also Read: IND vs AUS: విరాట్ కోహ్లీని ఆపకుంటే.. ఆస్ట్రేలియా సిరీస్‌ను గెలవడం చాలా కష్టం: ఆసీస్ మాజీ కెప్టెన్‌  


Also Read: బుధాదిత్య యోగం 2023.. ఈ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో విజయం! ఇందులో మీరు ఉన్నారా  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.