Traffic Diversions: హైదరాబాద్‌వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణం కారణంగా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు. దీనిని వాహనదారులు గుర్తించాలన్నారు. రేపటి నుంచి మరో జంక్షన్‌లో మళ్లింపు ఉంటుందన్నారు. అంబర్‌ పేట్‌ ఫ్లైఓవర్‌ పనులు కొనసాగుతున్నాయి. దీంతో గోల్నాక నుంచి అంబర్‌పేట్‌ వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. ఈమేరకు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉప్పల్‌ వైపు నుంచి వచ్చే వాహనదారులు అంబర్‌పేట్‌ శ్రీరమణ థియేటర్ సర్కిల్ నుంచి అలీ కేఫ్‌ చౌరస్తా నుంచి జిందాతిలిస్మాత్ రోడ్డును మీదుగా గోల్నాక్ వైపు వెళ్లాలన్నారు. చాదర్‌ ఘాట్‌ వైపు నుంచి వచ్చే వాహనదారులు కాచిగూడ నుంచి టూరిస్ట్ హోటల్, ఫీవర్ ఆస్పత్రి, తిలక్ నగర్‌ మీదుగా చే నెంబర్ సర్కిల్ వైపు నుంచి రామంతాపూర్‌ రోడ్డు మీదుగా పోవాలని ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్‌ చెప్పారు. 


ఇప్పటికే రెండుసార్లు ట్రయల్ రన్‌ చేసి ఇబ్బందులు గుర్తించామన్నారు. సమస్యలను పరిష్కరించేందుకే ట్రాఫిక్‌ను మల్లిస్తున్నామని తెలిపారు. ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు దాదాపు మూడు నెలల వరకు కొనసాగుతాయని వెల్లడించారు. నగరవాసులంతా గుర్తించాలని.. పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ట్రాఫిక్‌ రూట్‌కు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.


నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం(TS GOVT) శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగానే ట్రాఫిక్‌ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించింది. ప్రస్తుతం నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల అతిపెద్ద ఫ్లైఓవర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. షేక్‌పేట్‌లో ఆరులైన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించారు. శంషాబాద్‌లోనూ భారీ ఫ్లైఓవర్‌ నిర్మాణం జరుగుతోంది. నగరంలో మరిన్ని ఫ్లైఓవర్లను నిర్మిస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. దుర్గం చెరువులో కేసీఆర్ సర్కార్ నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.


Also read:1 Lakh Umbrella: ఆ గొడుగు ధర అక్షరాల రూ.లక్ష..ఏమిటా కథ.. విశేషాలు ఏంటి..?


Also read:Somuveer Raju Letter: ఏపీలో వరి మంటలు..సీఎం జగన్‌కు సోమువీర్రాజు లేఖాస్త్రం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.