Rainfall: హైదరాబాద్‌లో కుండపోత.. అత్యధిక వర్షపాతంతో నిండా మునిగిన ఆ ప్రాంతం
Heavy Rain Across Hyderabad City Vehicles Moves Slowly On Road: వర్షాకాలం ప్రారంభమే హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల భారీ వర్షం కురిసింది.
Heavy Rains Hit Hyderabad: నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరించినట్టే మంగళవారం భాగ్యనగరంలో కుండపోత వర్షం పడింది. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దాదాపు వర్షం కురిసింది. మోస్తరు నుంచి భారీ వర్షం పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో నగరం జలమయమైంది.
Also Read: Revanth Residence: ధర్నాలతో దద్దరిల్లిన రేవంత్ రెడ్డి నివాసం.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు
నగరవ్యాప్తంగా...
ముషీరాబాద్, గాంధీనగర్, చిక్కడపల్లి, రాంనగర్, బాగ్‌లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ట్యాంక్ బండ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కాచిగూడ, బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, ఆఫ్జల్ గంజ్, నాంపల్లి, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, జేఎన్‌టీయూ, బాలానగర్ పరిసర ప్రాంతాల్లో కురిసింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, చిల్కానగర్, నారపల్లి, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాగూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Also Read: Teachers Transfers: టీచర్లకు రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. బదిలీలు, ప్రమోషన్స్‌కు షెడ్యూల్ విడుదల
పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షం పడింది. నగరంలో సాయంత్రం వరకు వేడి ఉక్కపోతతో ఉన్న ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురుస్తుండడంతో నగరవాసులకు ఉపశమనం కలిగింది. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడడంతో ప్రధాన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. సిగ్నళ్ల వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి.
వర్షపాతం ఇలా..
కాగా మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. అత్యధిక వర్షపాతం ముషీరాబాద్ డివిజన్‌లోని బౌద్ధనగర్‌లో 46.8 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. రామంతపూర్ వార్డు కార్యాలయం వద్ద 46.5, కాప్రాలో 43.5, అంబర్‌పేట పల్టాన్ కమ్యూనిటీ హాల్ వద్ద 43.5, నాచారంలో 42.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా హిమాయత్‌నగర్‌లో 2.0 మిల్లీమీటర్ల మేర వర్షం పడింది.
ప్రజల ఇబ్బందులు
వర్షం కారణంగా ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులను అధికార యంత్రాంగం వెంటనే సహాయ చర్యలు చేపట్టింది. జీహెచ్‌ఎంసీ, పోలీస్ సిబ్బంది, విద్యుత్ ఉద్యోగులు పరస్పరం సహకరించుకుని ప్రజలు ఇబ్బందులు పడకుండా సత్వరమే చర్యలు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook