Musi riverfront hydra demolitions: హైదరబాద్ లో మరోసారి హైడ్రా హల్ చల్ కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు.. హైడ్రాకు చివాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. అసలు హైడ్రా చట్టబద్దత ఏంటని, కూల్చివేతలపైన  ఎక్కువగా మీ కాన్సెన్ ట్రెషన్ ఎక్కువగా ఉందని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టడానికి రెడీ అయ్యింది. మెయిన్ గా.. చాదర్‌ఘాట్ లోని పలు ప్రాంతాలు,  శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు ప్రారంభించారు. అక్కడ అనేక ఇళ్లపై...RB- X అని రాసి, ఇళ్ళు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



దీంతో పోలీసులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దాదాపు 140 ఇళ్లు ఖాళీ అయ్యాయి. అదే విధంగా  ఇళ్లు ఖాళీ చేసిన వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్నట్లు సమాచారం.మరోవైపు మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ లో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.  మూసీ నదీ పరివాహాక ప్రాంతంలో ఎఫ్ఠీఎల్ పరిధిని సర్వే చేసినట్లు తెలుస్తోంది.  


దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు తేలింది. అందులో పేద, మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీఓ కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. 


Read more: Hydra Victims: జనతా గ్యారేజ్‌లా మారిన తెలంగాణ భవన్..?.. బాధితులకు అండగా హరీష్ రావు, కేటీఆర్‌లు.. వీడియోలు ఇవే..


 ఇటీవల మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించి వాటిపైన RB-X అని పెద్ద అక్షరాలతో పెయింట్‌ వేసిన విషయం తెలిసిందే. కొంతమంది బాధితులు మాత్రం అధికారులపై తిరగబడ్డారు.ఈ నేపథ్యంలో అధికారులు మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామంటూ కూడా హమీ ఇచ్చారు. ఈక్రమంలోనే.. పోలీసుల భద్రతల మధ్య కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.


కొంత మంది బాధితులు మాత్రం రోడ్డెక్కి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అంబర్ పేట్ లోని గోల్నాక పరిధిలో.. కూల్చివేతలపై ఇప్పటికే మార్కింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తులసి రామ్ నగర్ పరిధిలొని ప్రజలు నిరసలనలకు దిగారు. ఈ కూల్చివేతలపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్పందించారు.  సీఎం రేవంత్ పై మండిపడ్డారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.