Musi hydra victims fires on cm revanth reddy: తెలంగాణలో హైడ్రా పేరు ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా మూసీనది సుందరీకరణ నేపథ్యంలో.. చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో మూసీ నదీ పరివాహాక ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకున్న వాళ్లు, దిల్ సుఖ్ నగర్ మొదలైన ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే హైడ్రా అధికారులు అనేక ఇళ్లకు రెడ్ మార్క్ లు వేసుకుని మరీ వెళ్లారు. అంతేకాకుండా.. వాటిని తొందరలోనే కూల్చివేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది.
హైడ్రా బాధితులతో మాట్లాడుతున్న మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి pic.twitter.com/K8N64AQQu1
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2024
ఈ నేపథ్యంలో వేలాదిగా ఆ ప్రాంతాలలో ఇళ్లను కట్టుకున్న వారు లబో దిబో మంటున్నారు. జీహెచ్ఎంసీ పర్మిషన్ లను తీసుకున్నామని, అన్నిరకాల ఫార్మాలిటీస్ పూర్తి చేసి, లోన్ లు తీసుకుని మరీ ఇళ్లను కొన్నామని, ఉన్న ఫళంగా తమ ఇళ్లను అక్రమ నిర్మాణాలు అంటే.. ఎంత వరకు న్యాయమని కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా.. కొంత మంది ఏళ్లుగా ఇక్కడ ఉన్నామని, ఇప్పుడు కూల్చేస్తామంటూ మాకు దిక్కేందని కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీంతో హైడ్రా బాధితుల కన్నీళ్లు..అందరికి కలిచివేస్తున్నాయి.
తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
హైడ్రా మూసీ బాధితులతో మాట్లాడుతున్న సబితమ్మ https://t.co/AvBfrPuX7f pic.twitter.com/HmBYPyKgyX
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2024
ఈ నేపథ్యంలో అనేక మంది మూసీ హైడ్రా బాధితులు.. తమను చంపిన తర్వాతే తమ ఇళ్లను కూల్చివేయాలని కూడా ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్ల జోలికి వస్తే.. ప్రాణ త్యాగాలకు సైతం సిద్దమని కూడా కొంత మంది బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వస్తే.. ఏదో మంచి జరుగుతుందనుకున్నామని.. ఇదేం న్యాయమంటూ కూడా..చాలా మంది ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ను బూతులు తిడుతూ, శాపనార్థాలు సైతం పెడుతున్నారు.
కొంత మంది మాత్రం గత బీఆర్ఎస్ సర్కారు పాలన బాగుందని, తమ ఖర్మకాలి.. కాంగ్రెస్ ను గెలిపించుకున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది హైడ్రా బాధితులు.. బీఆర్ఎస్ తెలంగాణ భవన్ కు చేరుకుని తమ గొడును మాజీ మంత్రులు హరీస్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, కేటీఆర్ లకు చెప్పేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తమను ఆదుకొవాలని కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. ఇదిలా ఉండగా.. హైడ్రా ఇప్పుడు పొలిటికల్ గా కూడా హాట్ టాపిక్ గా మారింది.
Read more: Hydra Victims: నీ అయ్య జాగీరా ఎవడ్రా నువ్వు మా ఇల్లు కూలగొట్టేది.. హైడ్రా వర్సెస్ మూసీ బాధితులు..
హైడ్రా బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. లీగల్ టీమ్ సహాయం కూడా చేస్తామని ప్రకటిచడంతో పెద్ద ఎత్తున మూసీ బాధితులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు హైడ్రా బాధితులు గోడును వింటున్నారు. తెలంగాణ భవన్ లో హైడ్రా బాధితులకు చెందిన అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Hydra Victims: జనతా గ్యారేజ్‌లా మారిన తెలంగాణ భవన్..?.. బాధితులకు అండగా హరీష్ రావు, కేటీఆర్‌లు.. వీడియోలు ఇవే..
తెలంగాణ భవన్ కు హైడ్రా బాధితులు..
బాధితుల గొడును విన్న హరిష్ రావు, సబితమ్మ