Hydra Issued Notice: నటుడు మురళీమోహన్‌కు నోటీసులు.. జయభేరీ సంస్థలపై హైడ్రా ఫోకస్..
Hydra Issued Notice To Murali Mohan: నటుడు మురళీ మోహన్ సంస్థపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో హైడ్రా నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలీలోని జయభేరీకి చెందిన సంస్థకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు తెలుసుకుందాం.
Hydra Issued Notice To Murali Mohan: నటుడు, మాజి టీడీపీ ఎంపీ మురళీమోహన్‌కు హైడ్రా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని రంగలాల్ కుంట బఫర్ జోన్, ఎఫీటీఎల్ జోన్‌లో మురళీ మోహన్ కు చెందిన జయభేరీ సంస్థ నిర్మించిట్లు తెలుస్తోంది. దీనిపై ఫోకస్ పెట్టిన హైడ్రా వాటని వెంటనే 15 రోజుల్లో తొలగించాలని లేకపోతే వాటిని బుల్డోజర్లతో కూల్చివేస్తామని హెచ్చిరించినట్లు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.
వర్షాలు వరదల నేపథ్యంలో కాస్త దూకుడు ఆపిన హైడ్రా మళ్లీ ఊపందుకుంది. నాలాలు, చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో అక్రమ నిర్మాణాలు చేపట్టినవారి వైపుగా మళ్లీ హైడ్రా బుల్డోజర్ దూసుకువస్తోంది. నెక్ట్స్ ఎవరు? అని అందరి దృష్టి హైడ్రాపైనే ఉంది. ఇటీవలె హీరో నాగర్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్‌లో నిర్మించారని హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసందే. ఇది నాగర్జునకు భారీ నష్టాన్నే మిగిల్చిందని చెప్పవచ్చు.
ఆ తర్వాత రామ్‌నగర్, హిమాయత్ సాగర్ వంటి ప్రాంతాల్లో కూడా కొన్ని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో కాస్త బ్రేక్ తీసుకున్న హైడ్రా మళ్లీ ఊపందుకుంది. ఈసారి టీడీపీ మాజీ ఎంపీ, ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆస్తులపై గురిపెట్టింది. గచ్చిబౌలీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో ఉన్న జయభేరీ సంస్థ చెరువుకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించారని ఇచ్చిన గడువులోగా దాన్ని వెంటనే తొలగించాలని హైడ్రా హెచ్చరించినట్లు తెలుస్తోంది. లేకపోతే వాటిని కూల్చివేస్తామని చెప్పినట్లు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఇరువైపుల నుంచి క్లారిటీ రాలేదు.
Also read: జియో రూ.223 రీఛార్జీప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా.. వ్యాలిడిటీ ఎన్ని రోజులు తెలుసా?
హైడ్రా దూకుడు కేవలం తెలంగాణలో మాత్రమే కాదు ఏపీలో కూడా తీవ్ర చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా వరదల నేపథ్యంలో హైడ్రా చేస్తున్న పనులు భేష్ అని కొందరు ప్రముఖులు ప్రశంసించిన సంగతి తెలిసిందే. భాగీరథమ్మ చెరువును కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అయితే, ఈ చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధుల్లో నిర్మాణ వ్యర్థాలు వేయడం పై కూడా కమిషనర్ రంగనాథ్ మండిపడ్డారు.
Also read: AP Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
ఇలా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడు ఏమాత్రం తగ్గించడం లేదు. ముఖ్యగా ఆయన హెచ్‌ఎండీఏ పరిధుల్లోని ఏడు జిల్లాల చెరువుల పరిరక్షణకు తీవ్ర కృషి చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి, గజ్వేల్ జిల్లాల్లో కూడా ఆక్రమణలకు త్వరలో చెక్ పడనున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.