నేనూ రైతునే.. రైతుగా చెబుతున్నాను.. మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
నేనూ ఒక రైతునే.. అందుకే రైతుగా చెబుతున్నాను.. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తే ప్రతిరైతు తప్పకండా రాజవుతాడంటూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేనూ ఒక రైతునే.. అందుకే రైతుగా చెబుతున్నాను.. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తే ప్రతిరైతు తప్పకండా రాజవుతాడంటూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా లాభసాటి పంటలు వేసి, రైతులు బాగు పడాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. దేశంలో తెలంగాణ లాంటి రాష్ట్రంగానీ, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిగానీ లేరని వ్యాఖ్యానించారు. ఇంకా బతికే ఉన్న.. చంపవద్దు: దిగ్గజ నటి
నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేయాల్సిన అవసరం - రైతులు తమ పంటల ద్వారా మంచి ధరలు పొంది లాభపడాల్సిన ఆవశ్యకతపై మంత్రి ఎర్రబెల్లి జనగామ జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మన్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్, సభ్యులు, జిల్లా కలెక్టర్, జిల్లాలోని వ్యవసాయశాఖ సహా, పలు శాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నగ్న వీడియోలతో బెదిరింపులు.. వివాహిత ఆత్మహత్య
సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తావించిన అంశాలు:
- నేనూ రైతునే.. అందుకే రైతుగా చెబుతున్నాను.. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తే ప్రతిరైతు తప్పకండా రాజవుతాడు
- రైతే రాజు అనడం కాదు. నిజంగా రైతుని రాజుగా చూడాలన్నదే తెలంగాణ సీఎం కేసీఆర్ లక్ష్యం
- ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చెప్పినట్లు పంటలు వేద్దాం. రైతులమంతా బాగుపడదాం
- ఏయే పంటలకు మార్కెట్ డిమాండ్ ఉందో ప్రభుత్వమే రైతులకు సూచిస్తుంది
- ఏ నేలలో, ఎక్కడ ఏయే పంటలు వేస్తే రైతులకు లాభసాటిగా ఉంటుందో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది
- రాష్ట్రంలో నేలలు, ఆయా ప్రాంతాల్లో భూసారం, అధిక దిగుబడి పంటలు, ఏ పంటలకు డిమాండ్ ఉందన్న విషయాలపై ప్రభుత్వం సర్వే చేసింది
- వ్యవసాయ శాఖ వద్ద శాస్త్రవేత్తలు రూపొందించిన పంటల ప్రణాళిక ఇప్పటికే సిద్ధంగా ఉంది
- ప్రభుత్వం చెప్పిన ప్రకారం పంటలు వేస్తేనే రైతులకు పెట్టుబడులతో పాటు, రైతుబంధు వంటి పథకాలు అందుతాయి
- ప్రభుత్వం పెట్టుబడి పెట్టి, రాయితీలు ఇవ్వడం, రుణాల మాఫీ లాంటివి చేస్తోంది.
- దేశంలో కేసీఆర్ లాంటి సీఎంగానీ, తెలంగాణ వంటి రాష్ట్రంగానీ దేశ చరిత్రలో లేదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..