ICRISAT: హైదరాబాద్​లోని ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్​ క్రాప్స్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ది సెమి అరిద్ ట్రాపిక్స్​) స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య  అతిథిగా హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50 ఏళ్ల వార్షికోత్సవాలకు హాజరైన ప్రధాని.. కార్యక్రమంలో ఇక్రిశాట్​ స్వర్ణోత్సవాల లోగో, స్టాంప్​ను ఆవిష్కరిచారు. క్లైమేట్ చేంజ్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీని, రాపిడ్ జెన్ రీసెర్చ్‌ ఫెసిలిటీని కూడా ప్రారంభించారు.



ప్రధానితో పాటు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్​ తమిళిసై, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, రాష్ట్ర సీఎస్​ సోమేశ్​ కుమార్ కూడా ఇక్రిశాట్​ను సందర్శించారు.


ప్రధాన రాక నేపథ్యంలో పటాన్ చెరువు సమీపంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.


ప్రధానికి సన్మానం..


ఇంక్రిశాట్​కు విచ్చేసిన ప్రధాని మోదీకి.. ఇక్రిశాట్​ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్ సన్మానం చేశారు. దీనితో పాటు పరిశోధనల గురించి ప్రధానికి వివరించారు ఇక్రిశాట్​ శాస్త్రవేత్తలు. కొత్త వంగడాల సృష్టి, ఇటీవలి కాలంలో చేసిన పరిశోధనల గురించి కూడా మోదీకి వివరించారు.


శాస్త్రవేత్తలకు అభినందనలు..


ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. స్వర్ణోత్సవం సందర్భంగా ఇక్రిశాట్ శాస్త్రవేత్తలందరికి అభినందనలు తెలిపారు.


ఇక్రిశాట్ పరిశోధనలు సన్నకారు రైతులకు ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇక్రిశాట్ పరిశోధనలపైనా అయన హర్షం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా ప్రపంచ దేశాలకు వ్యవసాయం సులభరం చేయడంలో ఇక్రిశాట్​ ఎంతో అనుభవం గడించిందన్నారు. ఆ అనుభవాన్ని భారత వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని.


సన్నకారు రైతులపై ప్రత్యేక దృష్టి..


ప్రభుత్వం కూడా వ్యవసాయ వ్యయం తగ్గించేందుకు ప్రోత్సహకాలకు అందిస్తుందని వెల్లడించారు. అదే విధంగా వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించేందుకు కూడా బడ్జెట్​లో నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు.


ముఖ్యంగా 80 శాతం కంటే ఎక్కువగా ఉన్న సన్నకారు రైతులపై ప్రత్యేక దృష్టితోనే 2022-23 బడ్జెట్​లో కేటాయింపులు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా డ్రోన్ల వినియోగం వంటి వాటి గురించి ఆయన ముఖ్యమైన వివరాలు వెల్లడించారు. వాతావరణ మార్పుల నుంచి కూడా రైతులను కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు.


Also read: Janga Reddy Passed Away : బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి కన్నుమూత


Also read: Weather news: తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా... భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook