గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల హైదరాబాద్ ( Hyderabad) లో జనజీవనం అస్తవ్యస్తం అయింది. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుక్కున్నాయి. మరణాల సంఖ్య 13కు చేరుకుంది. వాతావరణ శాఖ ( IMD ) భాగ్యనగరంలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ: Hyderabad Rains: నగరంలో ఎటుచూసినా నీరే.. హెల్ప్ లైన్ నెంబర్ల జారీ


దాంతో పాటు వాయుగుండం ప్రస్తుతం మహారాష్ట్ర వైపు కదులుతోంది అని సమాచారం అందించింది. అదే సమయంలో వికారాబాద్, సిద్ధిపేట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అప్రమత్తం చేసింది. దీంతో తెలంగాణ ( Telangana ) రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు రెండు రోజుల సెలవును ప్రకటించింది. 


ఇంట్లోనే ఉండండి


సైబరాబాద్ (Cyberabad ) పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఈ సందర్భంగా ప్రజలకు సూచనలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్పా ఇంటి నుంచి బయటికి రావద్దు అని సూచించారు. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో... ఇంటిని నుంచి అనవసరంగా బయటికి రావద్దని ప్రజలను కోరారు. అదే సమయంలో  ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ( Emergency Numbers in Hyderabad Rains) 9490617744కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. అధికారులు అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నారు అని తెలిపారు.


పరీక్షలు వాయిదా...
భారీ వర్షాల నేపథ్యంలో అక్టోబర్ 14, 15 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం ( Osmania University ) తెలిపింది. అదే సమయంలో జేఎన్‌టీయూ కూడా అన్ని పరీక్షలను ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో మళ్లీ ప్రకటిస్తాం అని అధికారులు సమాచారం అందించారు.
ALSO READ JNTUH Exams Postponed: జేఎన్‌టీయూ యూజీ, పీజీ పరీక్షలు వాయిదా


భారీ వర్షాపాతం


మంగళవారం ఉదయం 8.30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో కు మేడ్చల్ మల్కాజగిరిలో 292.5 మిమీ వర్షాపాతం నమోదు అయింది. అదే సమయంలో యాదాద్రిలోని వెర్కాట్ పల్లేలో 250.8 మిమీ వర్షాపాతం నమోదు అయింది.


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ (GHMC) పరిధిలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది. దాంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.


భారీ వర్షాలు, వరద ముప్పు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధికారులను, జిల్లా కలెక్టర్లను అలెర్ట్ గా ఉండమని...వరదకు సంబంధించిన ప్రోటోకాల్స్ ను పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR