Telangana Rain Alert: గత వారం పదిరోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కన్పిస్తోంది. ఏప్రిల్ నుంచి మే ప్రారంభం వరకూ భగభగమండే ఎండలతో అల్లాడిన ప్రజానీకం వర్షాలతో కాస్త ఉపశమనం పొందారు. ఇక రానున్న వారం రోజుల వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొద్దిరోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే నిన్నట్నించి వర్షం పడుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, పఠాన్ చెరువు, అమీన్ పూర్, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లోనూ, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, ఆబిడ్స్, నాంపల్లిలోనూ వర్షాలు పడ్డాయి. రానున్న వారంలో రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపిన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మద్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు తమిళనాడులో మరో ఆవర్తనం ఏర్పడింది. 


ఉపరితల ఆవర్తనం కారణంగా మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్, జనగామ, మంచిర్యాల, యాదాద్రి భువనగరి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, వనపర్తి, జోగులాంబ, నారాయణ పేట, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, శంకర్‌పల్లి ప్రాంతాల్లో కూడా రానున్న రెండ్రోజుల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 


హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు పడేటప్పుడు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. 


Also read: Low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook