TS Weather Forecast: మహారాష్ట్రలోని పశ్చిమ విదర్బ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. మరోవైపు దక్షిణం, ఆగ్నేయం నుంచి గాలులు అధికంగా వీస్తున్నాయి. ఫలితంగా తెలంగాణలో ఇవాళ రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రానున్న 5 రోజుల వరకూ కొన్ని ప్రాంతాలకు భారీ వర్షసూచన ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి రుతుపవనాలు కాస్త త్వరగానే అంటే మరో నాలుగు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్నాయి. ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా. మరోవైపు స్థానికంగా ఆవహించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ, ఎల్లుండి ఉరుములు మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, పిడుగులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక మే 16 అంటే రేపటికి తెలంగాణలోని ఆసిఫాభాద్, పెద్దపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఫలితంగా రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.


ఇక హైదరాబాద్‌లో ఇవాళ వాతావరణం కాస్త మేఘావృతంగా ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచన ఉంది. గరిష్టంగా ఇవాళ 37 డిగ్రీలు నమోదు కావచ్చు. నిన్న బుధవారం సైతం గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీలే నమోదైంది. 


Also read: IMD Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈసారి జూన్-ఆగస్టు నెలల్లో భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook