Heavy rains: ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
Heavy rains in telangana: హైదరాబాద్: ఈ నెల 12, 13 తేదీల్లో.. అంటే ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచిస్తూ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red alert) జారీచేసింది.
Heavy rains in telangana: హైదరాబాద్: ఈ నెల 12, 13 తేదీల్లో.. అంటే ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచిస్తూ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red alert) జారీచేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.
నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో పాటు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో పలు చోట్ల గత వారం రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారం పలు చోట్ల కుండపోత వర్షం (Rains in Hyderabad) కురిసింది.
Red alert issued: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల జాబితా
ఇవాళ వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
అలాగే రేపు ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
Farmers worry about their paddy: ఆ రైతుల్లో ఆందోళన
భారీ వర్షసూచన సాగుకు సిద్ధమైన రైతుల్లో సంతోషాన్ని నింపుతున్నప్పటికీ... ఇంకా ధాన్యం అమ్ముడుపోని ప్రాంతాల్లో రైతులు (Farmers in Telangana) తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యం మొలకెత్తగా అధికారులు, మిల్లర్లు ఆ వడ్లను (Paddy) తీసుకోవడానికి తిరస్తరిస్తున్నారని, ఇక మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని ఆ రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.