Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు
Heavy Rains alert in telangana: భగభగమండే ఎండలతో అల్లాడుతున్న ప్రజానీకానికి ఊరట లభించింది. భారీ వర్షాలతో సేదతీరారు. కానీ అకాల వర్షాలతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంది. రానున్న 4 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains alert in telangana: గత కొద్దిరోజులుగా భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు భారీ వర్షంతో ఒక్కసారిగా సేదతీరారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలో వర్షాలు పడటంతో రైతులకు నష్టం వాటిల్లింది. హైదారాబాద్‌లో అయితే గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం నమోదైంది.
మండుతున్న ఎండాకాలంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇంకొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో బీభత్సం చోటుచేసుకుంది. హైదారాబాద్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షం కురిసింది. శేర్‌లింగంపల్లిలో అత్యధికంగా 10.8, సికింద్రాబాద్‌లో 8.4, కేపీహెచ్‌పిలో 7, గాజుల రామారంలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దయిన పరిస్థితి ఉంది.
ఇక రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులుంటాయిని వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొందని, ఈ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పిడుగులు భారీగా పడుతున్నందున జాగ్రత్తగా ఉండాలంటోంది. బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద, పొలాల్లో సంచరించవద్దని కోరుతోంది.
Also read: భారీ వర్షంతో సీఎం రేవంత్ కరీంనగర్ సభ రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook