Telangana Weather Forecast: వాయవ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతు పవనాల జోరు కొనసాగుతోంది.దాంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరానికి అతి భారీ వర్షం హెచ్చరిక పొంచి ఉందని ఐఎండీ వివరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో అయితే ఎప్పుడైనా అతి భారీ వర్షం విరుచుకుపడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని వెల్లడించింది. పశ్చిమ, నైరుతి దిశ నుంచి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీయనున్నాయి. ఇవాశ, రేపు హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయని హెచ్చరించింది. ఈ నెల 18 వరకూ ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.


ఇవాళ అంటే మంగళవారం మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల , జగిత్యాల, నిర్మల్, అదిలాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జనగాం, ఖమ్మం, పెద్దపల్లి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. 


తెలంగాణలోని వివిధ జల్లాల్లో కురిసిన వర్షపాతం వివరాలు


కరీంనగర్ జిల్లా గంగాధరలో అత్యధికంగా 116 మిల్లీమీటర్లు
జగిత్యాల జిల్లా మల్యాలలో 103 మిల్లీమీటర్లు
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 97.8 మిల్లీమీటర్లు
జగిత్యాల జిల్లా  కొడిమల్‌లో 94 మిల్లీమీటర్లు
నిర్మల్ జిల్లాలో 85.3 మిల్లీమీటర్లు
జగిత్యాల జిల్లా తిరుమలపూర్‌లో 64.5 మిల్లీమీటర్లు
నిర్మల్ జిల్లా బాసరలో 85.3 మిల్లీమీటర్లు


Also read: TG DSC and Groups issue: సచివాలయం దగ్గర హైటెన్షన్... నిరసనకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు.. వీడియో ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook