Imd weather forecast for both telugu states for coming 3 days: కొన్నిరోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దేశంలో విస్తరించాయి. అంతేకాకుండా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల కూడా భారీగానే వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న మూడు రోజుల పాటు.. అంటే.. 30,31, సెప్టెంబర్ 1న వరకు భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 తూర్పు-మధ్య బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాలలో ఆవర్తనం విస్తరించి ఉందని తెలుస్తొంది. దీని ప్రభావంతో తూర్పు-మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతం వద్ద అల్పపీడనంవల్ల వర్షాపాతం నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల.. తెలంగాణలో కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


ముఖ్యంగా ఆదిలాబాద్,నిర్మల్ , కరీంనగర్, రాజన్నసిరిసిల్లా,  కొమురంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం లలో భారీగా వర్షం కురుస్తుందని తెలుస్తోంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు, బలమైన గాలులు సైతం వీస్తాయని వాతారణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది.


ఏపీలో అతిభారీ వర్షాలు..


ఏపీలో కూడా కుండపోతగా వర్షాలు  కురిసే  చాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు నుంచి నాలుగు రోజులపాటు  భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం , అదే విధంగా అరేబియాలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల కూడా భారీగా వర్షాపాతం నమోదవుతుందని తెలుస్తొంది. ఏపీలోని అన్నిప్రాంతాలలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


Read more: Kolkata doctor murder: అరగంటలో మూడు ఫోన్ కాల్స్.. కోర్టులో షాకింగ్ నిజాలు చెప్పిన కుటుంబీకులు.. ఎవరు చేశారో తెలుసా..?


బలమైనగాలులతో పాటు, గంటలకు 50 నుంచి 60 కి.మీల వేగంతో గాలులు వీస్తాయనికూడా వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా వర్షాలు కురిసినప్పుడు విద్యుత్ స్తంభం, వయర్ లకు, మ్యాన్ హోల్స్ ల విషయంలో మాత్రం కాస్తంతా జాగ్రత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.