Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే వారికి గుడ్ న్యూస్
Indian Army Jobs: తెలంగాణ ప్రాంతం నుండి ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే యువతకు గుడ్ న్యూస్. సూర్యాపేటలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఇది.
Indian Army Jobs: తెలంగాణ ప్రాంతం నుండి ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే యువతకు గుడ్ న్యూస్. సూర్యాపేటలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఇది. అందుకు ఆన్లైన్ దరఖాస్తుకు ఈనెల మూడవ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని.. తెలంగాణ వ్యాప్తంగా సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులు www.indianarmy.nic.in వెబ్‌సైట్లో ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ పంపించాలని రిటైర్డ్ కల్నల్ డాక్టర్. సుంకరి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పంపిన అభ్యర్థులకు అక్టోబర్ 15 నుండి 31 అక్టోబర్ వరకు సూర్యాపేటలోని ఎస్వి కాలేజీ గ్రౌండ్స్‌లో ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ విభాగము వారు ఆర్మీ సెలక్షన్స్ నిర్వహిస్తారని శ్రీనివాస్ రావు తెలిపారు.
ఇండో - చైనా బార్డర్‌లోని గల్వాన్‌లో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు సొంత పట్టణం సూర్యాపేటలో ఆర్మీ సెలక్షన్స్ జరిగేలా రిక్రూట్మెంట్ విభాగము నోటిఫికేషన్ విడుదల చేసిందని సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ జరగడం మనందరికీ గర్వకారణం అని శ్రీనివాస్ రావు అన్నారు. సూర్యాపేట శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సహకారం ఎంతో ఉందని అన్నారు.
[[{"fid":"243679","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Indian-Army-recruitment-in-Suryapet.jpg","field_file_image_title_text[und][0][value]":"అక్టోబర్ 15 నుండి 31వ తేదీ వరకు సూర్యాపేటలోని ఎస్వీ కాలేజీలో ఆర్మీ సెలక్షన్స్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Indian-Army-recruitment-in-Suryapet.jpg","field_file_image_title_text[und][0][value]":"అక్టోబర్ 15 నుండి 31వ తేదీ వరకు సూర్యాపేటలోని ఎస్వీ కాలేజీలో ఆర్మీ సెలక్షన్స్"}},"link_text":false,"attributes":{"alt":"Indian-Army-recruitment-in-Suryapet.jpg","title":"అక్టోబర్ 15 నుండి 31వ తేదీ వరకు సూర్యాపేటలోని ఎస్వీ కాలేజీలో ఆర్మీ సెలక్షన్స్","class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇండియన్ ఆర్మీలో చేరేందుకు శిక్షణ పొందాలనుకునే అభ్యర్థుల్లో 225 మంది యువకులకు సోల్జర్స్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని ఎస్వి కాలేజీ మైదానంలో ప్రత్యేక శిక్షణ అందిస్తూ వారికి భోజన, వసతి సదుపాయం కూడా కల్పించామని తెలిపారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ నమోదు చేయడానికి మరో రెండు రోజులే గడువు మిగిలి ఉందని శ్రీనివాస్ రావు గుర్తుచేశారు. 17.5 సంవత్సరాలు నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు, 166cm ఎత్తు కలిగి టెన్త్ లేదా ఇంటర్మీడియట్ విద్యార్హతలు కలిగి ఉండి, దేశ సేవ చేయాలనుకునే యువతకు ఇదొ చక్కటి అవకాశం.
Also Read : Harish Rao: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలో మరో గ్రూప్ నోటిఫికేషన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి