Scam in Jagtial Union Bank of India: జగిత్యాల జిల్లాలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ స్కామ్ వెలుగుచూసింది. బ్యాంకులో నకిలీ ఖాతాలు సృష్టించి రుణాల పేరిట భారీ మొత్తాన్ని కాజేసిన ఉదంతం బయటపడింది. బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ ఆపరేటర్ కలిసి ఈ భారీ స్కామ్‌కి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇటీవల బదిలీపై మోతీలాల్ అనే కొత్త మేనేజర్ వచ్చారు. గతంలో ఇదే బ్యాంకుకు మేనేజర్‌గా పనిచేసిన సుమన్, క్లర్క్ రాజేశ్ కలిసి భారీ మోసానికి పాల్పడినట్లు మోతీలాల్ గుర్తించారు. 40 నుంచి 60 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి రుణాల పేరిట రూ.1 కోటి 15 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. దీనిపై మోతీలాల్ జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఇద్దరిపై కేసు నమోదైంది. 


ఈ స్కామ్‌పై జగిత్యాల పోలీసులు మాట్లాడుతూ..  ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు, రైతు రుణాలు, వ్యక్తిగత రుణాల పేరిట నిందితులు బ్యాంకు నుంచి నగదు కాజేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు.  ప్రస్తుత బ్యాంకు మేనేజర్ మోతీలాల్ దీనిపై ఫిర్యాదు చేశారని.. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రుణాలు ఇవ్వకుండానే ఖాతాల ద్వారా ఆ మొత్తాన్ని డ్రా చేసినట్లు ఫిర్యాదులో మోతీలాల్ పేర్కొన్నట్లు వెల్లడించారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే అసలు ఎంత కాజేశారనేది తెలుస్తుందంటున్నారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరు సస్పెన్షన్‌లో ఉన్నట్లు సమాచారం. 


Also Read: Bride Gun Firing: పెళ్లిలో తుపాకి పట్టిన వధువు.. షాక్ లో వరుడు తరపు బంధువులు!


Also Read: CM KCR Health Update: కేసీఆర్ హెల్త్‌పై యశోద వైద్యుల ప్రెస్ మీట్.. సీఎం ఆరోగ్యంపై ఏం చెప్పారంటే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook