Jupally Krishna Rao Vs KT Rama Rao: కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త దారుణ హత్య తెలంగాణ రాజకీయాల్లో చిచ్చు రేపింది. మంత్రి జూపల్లి కృష్ణారావు హత్యకు కారణమని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బూతులతో విరుచుకుపడ్డారు. మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై కూడా జూపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలేని విధంగా మంత్రి నోటి నుంచి బూతులు వచ్చాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KT Rama Rao: శ్రీధర్‌ రెడ్డి హత్యపై కేటీఆర్‌ ఫైర్‌.. ఇలాంటివి మళ్లీ జరిగితే రేవంత్‌ రెడ్డి తట్టుకోలేవు


 


వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు శ్రీధర్‌ రెడ్డి గురువారం హత్యకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న కేటీఆర్‌ కొల్లాపూర్‌కు హుటాహుటిన వెళ్లారు. రోజంతా శ్రీధర్‌ రెడ్డి అంత్యక్రియల్లో ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావుపై మండిపడ్డారు. హత్యకు కారణం జూపల్లి అని.. అతడిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. 

Also Read: Brutally Murder: తెలంగాణలో మరో రాజకీయ హత్య.. మంచంపై పడుకున్న నాయకుడిపై క్రూరంగా దాడి


 


ఈ విమర్శలపై జూపల్లి కృష్ణారావు శుక్రవారం స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌ రెడ్డి హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేటీఆర్‌ తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలపై వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే ప్రజల ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు.


అనంతరం మరింత రెచ్చిపోయి కేటీఆర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌లపై జూపల్లి బూతులతో విరుచుకుపడ్డారు. వారిద్దరిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. వారిద్దరూ కలిసి తనపై బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలు చేయడం దురదృష్టమని చెప్పారు. హత్యలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడడం సరికాదు. హత్య విషయంలో చర్చకు ఏ చౌరస్తాకు రమ్మన్నా వస్తానని సవాల్‌ విసిరారు. అయితే శ్రీధర్‌ రెడ్డి హత్యపై కీలక ఆరోపణలు చేశారు. అతడికి కుటుంబసభ్యుల మధ్య భూతగాదాలు ఉన్నాయని వివరించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter