Kollapur Elections Result: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులారికి తెచ్చుకుంటే చాలు ప్రపంచంలో ప్రజలందరికీ మన పేరు తెలిసిపోతుంది.‌ ఏదో ఒక చిన్న వీడియోతో ఫేమస్ అయితే…ఇక పేరు దేశం మొత్తం మారుమోగిపోతుంది. ఇలా ఒక్క వీడియో తో బాగా పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపించిన పేరు బర్రెలక్క.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకొచ్చిన పాపులారిటితో ఎలక్షన్స్ లో సైతం నిలబడింది ఈమె. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎక్కువగా మారుమోగిన పేరు బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.  తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నొటిఫికేషన్స్ వేయడం లేదంటూ.. అందుకే తాను బర్రెలు కొనుక్కున్నానని ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది శిరీష. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అయ్యి ఆఖరికి శిరీషపై కేసు కూడా నమోదైంది. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది. మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో ఆమెకు తోడుగా నిలిచేవారు సోషల్ మీడియాలో ఎక్కువైపోయారు. అంతేకాదు కొంతమంది తనను అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేయమని సలహా కూడా ఇచ్చేశారు.


దాంతో ఆమె ధైర్యంగా నామినేషన్ వేసి.. జనంలోకి వెళ్లింది. ఇక తాను తప్పకుండా గెలుస్తుందని తనని సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన వారందరూ అనుకున్నారు. కొందరు ఎన్ఆర్ఐలు సైతం ఆమెకు మద్దతు ఇచ్చారు. ఇక దీంతో బర్రెలక్క పైన సోషల్ మీడియాలో మరింత బజ్ క్రియేట్ అయింది. కొల్లాపూర్ నుంచి బర్రెలక్క గెలుస్తుందనేంతగా ప్రచారం జరిగింది. అయితే సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి రియల్ సొసైటీలో చూస్తే మాత్రం  పరిస్థితి వేరుగా ఉంది. బర్రెలక్క గెలుపు అనేది చాలా కష్టం అని అర్థమైపోతోంది.


సోషల్ మీడియాలో బర్రెలక్క జోరు చూసి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా కంగారు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా బర్రెలక్క తమ్ముడిపై కూడా ఎన్నికల్లో నిలబడ్డాక దాడి జరగడంతో... ఆమె గెలుస్తుందనే భయంతోనే ఇలా చేస్తున్నారని తెలంగాణలో చాలా మంది మండిపడ్డారు. అయితే ప్రస్తుతం ఫలితాలు చూస్తే మాత్రం.. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి వేరేలా ఉంది. బర్రెలక్క పైన కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు ఓట్లు పరంగా దూసుకెళ్తున్నారు. బర్రెల అక్క మాత్రం వెనక పడిపోయింది. బయట నియోజకవర్గల నుంచి ఈమెకు ఎంతో మద్దతు వచ్చినా సొంత నియోజకవర్గంలో బర్రెలక్కకు సరైన మద్దతు లభించలేదు. అందుకే ఓట్ల దగ్గర బర్రెలక్క విజయం తారుమారు అయిపోయింది అన్నట్టు అర్థమవుతుంది.


Also read: Madhya Pradesh Election Result 2023: మధ్యప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో బీజేపీ..


 


Also Read: Animal Movie: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook