Ka Paul On  Kcr:సంచనాలకు కేరాఫ్ గా నిలుస్తారు కేఏ పాల్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. గల్లీ నుంచి అమెరికా అంశాలపై వరకు తనదైన శైలిలో స్పందిస్తుంటారు కేఏ పాల్. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేఏ పాల్ ఇటీవల కాలంలో తెలంగాణపై ఎక్కువ ఫోకస్ చేశారు. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలను చీల్చి చెండాడుతున్నారు. కొన్ని రోజులుగా తెలంగాణ జిల్లాలు చుట్టేస్తున్నారు. ప్రజలను కలుస్తూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించిన కేఏ పాల్.. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల- జక్కాపూర్  సరిహద్దులో  కేఏ పాల్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు పాల్. రైతులను పరామర్శించడానికి వస్తే అడ్డుకుంటారా అని నిలదీశారు. తనను అడ్డుకుంటే చట్టపరంగా ముందుకు వెళుతానని, కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని పోలీసులను హెచ్చరించారు. తనతో దురుసుగా వ్యవహరిస్తే అందరిని సస్పెండ్ చేయిస్తానంటూ పెద్దగా కేకలు వేశారు కేఏ పాల్. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్, కేటీఆర్ జాగీరా అని ప్రశ్నించారు. తెలంగాణలో గ్రామాలకు వెళ్లడానికి పోలీసుల పర్మిషన్ ఎందుకని కేఏ పాల్ మండిపడ్డారు.


కేసీఆర్, కేటీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేసిన కేఏ పాల్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను టార్గెట్ చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి లోకంలో లేకుండా పోయారని కామెంట్ చేశారు. కేసీఆర్.. నన్ను అడ్డుకుంటే వైఎస్సార్ పట్టిన గతే పడుతుందంటూ కేఏ పాల్ శాపనార్ధాలు పెట్టారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో కేసీఆర్ చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ తన దగ్గర చేతులు కట్టుకుని నిల్చున్నారని చెప్పారు. ఇప్పుడు అధికారం ఉంది కదా అని విర్రవీగవద్దని కామెంట్ చేశారు కేఏ పాల్. ప్రజలను కలిసేందుకు తాను పోలీసు వాహనంలో వెళ్లడానికి కూడా సిద్ధమేనన్నారు కేఏ పాల్.


READ ALSO: KTR VERSES KISHAN REDDY : కేటీఆర్ వర్సెస్ కిషన్‌ రెడ్డి.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ట్వీట్ల యుద్ధం


Prashanth Kishor: ప్రశాంత్ కిషోర్ పార్టీ వెనుక కేసీఆర్? ప్రత్యామ్నాయ శక్తి ఇదేనా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.