Munugode Bypoll: పోలింగ్ ముగిసినా మునుగోడు ఉప ఎన్నిక కాక మాత్రం తగ్గలేదు. పోలింగ్ తర్వాత ఎవరూ గెలుస్తారన్న దానిపై తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఏ ఇద్దరు కలిసినా మునుగోడు ఫలితం గురించే చర్చించుకుంటున్నారు. పోలింగ్ సమయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర పోలీసులు అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందనే టాక్ వస్తోంది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, మునుగోడు అభ్యర్థి కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలింగ్ ముగిశాకా ఈవీఎంలను తరలిస్తున్న ట్రక్ అనుకోకుండా మాయమైందని  కేఏపాల్ ఆరోపించారు. ఈవీఎంలను రీ ప్లేస్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ తనకు అనుకూలంగా ఏకపక్షంగా జరిగిందని.. ఓటమి ఖాయమని తేలడంతో అధికార పార్టీ కుట్రలు చేస్తుందని పాల్ మండిపడ్డారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం గోల్‌మాల్ చేస్తున్నారని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే తాను 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని  కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడి మరీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. తాను ఒక్క రూపాయి కూడా పంచకుండానే గెలవబోతున్నానని తెలిపారు. తాను 100 పోలింగ్ కేంద్రాలను పరిశీలించానని.. అన్ని బూతులలోనూ ఉంగరం హవా కనిపించిందని తెలిపారు. తనకు లక్షా 10 వేల ఓట్లు వస్తాయని చెప్పారు కేఏ పాల్. మునుగోడులో తన గెలుస్తానని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో కేసీఆర్ నిద్ర కూడా పోవడం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఐటీ, ఈడీ, సీబీఐలను బీజేపీ వాడుకుంటుంటే.. సీఐడీని కేసీఆర్ వాడుకుంటున్నారని కేఏ పాల్ ఆరోపించారు.


గత పాలకుల నిర్లక్ష్యం వల్లే మునుగోడులో అభివృద్ధి జరగలేదన్నారు కేఏ పాల్. మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా నిలిచిందన్నారు.  మునుగోడు లో విజయం సాధిస్తే తాను సీఎం అవుతానన్నారు.మునుగోడు ప్రజల కోసమే తాము ఉప ఎన్నికలో పోటీ చేశానన్నారు. తనను సీఎం, సీఎం అని సభల్లో నినాదాలు చేస్తుంటే ఎస్పీ హడలిపోయారని అన్నారు. పోలింగ్ రోజున తనపై ఓ పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. ఇదంతా చూస్తూ కూడా ఎస్పీ  సైలెంట్ గా ఉన్నారన్నారు. మునుగోడు ప్రచారం సందర్భంగా తనపై  మూడు సార్లు దాడి జరిగిందన్నారు. ఇప్పటివరకు తాను ఎంతోమంది నియంతలను చూశానని.. కాని కేసీఅర్ లాంటి నియంతను మాత్రం చూడలేదన్నారు. కేసీఆర్ ముక్త్, బీజేపీ ముక్త్, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ చేయడమే తన లక్ష్యమన్నారు కేఏ పాల్.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook