Why KCR Is Contesting From Kamareddy: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వీకులు కామారెడ్డి ప్రాంతానికి చెందిన వారు కాబట్టి ఇక్కడి నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తాను కోరిన కోరిక మేరకే ఇక్కడి నుండి పోటీ చేస్తామని తెలుపడం సంతోషమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కొందరు సీనియర్ ప్రతిపక్ష నాయకులు రాజకీయం కోసం కామారెడ్డిలో అభివృద్ది జరగలేదని మాట్లాడుతున్నారని అన్నారు. అవగాహన లేకుండా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అభివృద్ది పైన చిత్త శుద్ది లేకుండా రాజకీయం కోసం విమర్శించడం సమంజసం కాదని హితవు పలికారు. కామారెడ్డి అభివృద్దిని చూసి కూడా సినియన్ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడడం కల్లుండి కూడా చూడలేని గుడ్డివారిగా ఉందని అన్నారు. 


గత కాంగ్రెస్ పార్టీ హయాంలో కామారెడ్డి నియోజికవర్గానికి ఎస్ ఆర్ ఎస్పీ నుండి నిర్మించిన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం నాసిరకంగా ఉండడం వలన చాలా బ్రేక్ డౌన్ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ సమస్యతో కామారెడ్డి నియోజికవర్గంలో నెలలో 30 రోజులకు 10 నుండి 12 రోజుకు మంచి నీరు రాని పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే 47 కిలో మీటర్లు ఎస్ ఎం పైప్ లైన్ నిర్మాణం కోసం జి ఓ నంబర్ 460 ద్వారా 195 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వెల్లడించారు. ఎస్ ఆర్ ఎస్ పి నుండి జలాల్‌పూర్ అక్కడి నుండి ఇందల్‌వాయి, మల్లన్న గుట్ట వరకు 47 కిలో మీటర్లు మేర పైప్ లైన్ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రూరల్ డెవలప్మెంట్, మిషన్ భగీరథ శాఖల ద్వారా ఈ నిర్మాణ పనులు జరుగుతాయని తెలిపారు. గత కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పటి నాయకులు ఎన్నికల ముందు నాసి రకపు జి అర్ పి పైప్ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. 


కొందరు సీనియర్ నాయకులు రాజకీయం కోసం కామారెడ్డిలో అభివృద్ది జరగలేదని ఆనందం సరికాదని అన్నారు. అంతకు ముందు  నియోజికవర్గంలోని కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూర్ మండలాలకు చెందిన 8 మంది పంచాయతీ కార్యదర్శులకు పర్మనెంట్ ఆర్డర్ పత్రాలను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి కార్యదర్శులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.