MP Bandi Sanjay: కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్లోకే.. ఆ మూడు పార్టీలను బొందపెట్టండి: బండి సంజయ్
Manakondur Assembly Constituency: కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్ఎస్లోకే వెళుతుందన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేయాలని చూస్తున్నాయని.. ఆ మూడు పార్టీలను బొంద పెట్టాలని కోరారు.
Manakondur Assembly Constituency: ‘‘అరేపల్లి మోహన్ పక్కా లోకల్. మానకొండూరు నియోజకవర్గంలోని గల్లీగల్లీ పట్ల అవగాహన ఉంది. సమస్యలన్నీ తెలుసు. ఆయనను గెలిపిస్తే అభివ్రద్ధి జరుగుతుంది. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కమీషన్ల యావతో మిమ్ముల్ని పట్టించుకోవడం మానేసిండు. తగిన గుణపాఠం చెప్పండి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మానకొండూరు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం బీజేపీ మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి ఆరెపల్లి మోహన్ దాఖలు చేసిన నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మానకొండూరు చెరువు నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం భారీ ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
"మానకొండూరులో రోడ్ల సమస్య కంటే సిట్టింగ్ ఎమ్మెల్యేనే అతిపెద్ద సమస్య. ఆయనను ఓడిస్తేనే ప్రజలకు మనశ్శాంతి లభిస్తుంది. ఆరెపల్లి మోహన్ పక్కా లోకల్. మోహన్‌ను గెలిపిస్తేనే మానకొండూరు అభివృద్ధి సాధ్యం. మానకొండూరులో జాతీయ రహదారిని విస్తరించాలని ఎప్పటి నుంచో కోరుతుంటే ఎమ్మెల్యే పట్టించుకోలే. నేనే కేంద్రంతో మాట్లాడి రూ.20 కోట్లు తీసుకొచ్చి రిపేర్ చేయించిన. అదే సమయంలో జాతీయ రహదారిని విస్తరించేలా కేంద్రాన్ని ఒప్పించి ప్రధానమంత్రి మోదీతో విస్తరణ పనులకు శంకుస్థాపన చేయించిన.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిదులిస్తోంది కేంద్రమే. పేదలందరికీ ఉచితంగా బియ్యం అందిస్తోంది. మరో 5 ఏళ్లపాటు ప్రజలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తామని మోదీ ప్రకటించారు. ఇకపై ఉచిత బియ్యం మేమే ఇస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెబితే గల్లా పట్టి నిలదీయండి. తగిన బుద్ది చెప్పండి. గ్రామాల్లో జరిగే ఉపాధి హామీ పనులకు నిధులిస్తోంది కేంద్రమే. మొక్కల పెంపకం, రైతువేదికలు మొదలు స్మశాన వాటికల నిర్మాణం దాకా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోంది. అయినా సిగ్గు లేకుండా బీఆర్ఎస్ నేతలు తామే ఆ పనులు చేస్తున్నట్లు అబద్దాలు చెబుతున్నరు.
మీరు నన్ను గెలిపించి ఎంపీని చేస్తే వేల కోట్ల నిధులు తీసుకొచ్చిన. మీ దీవెనలతో కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దం చేసిన. 50 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన జైలుకు పోయిన. రైతుల పక్షాన లాఠీ దెబ్బలు తిన్నం. వడ్ల కొనుగోలు పైసలన్నీ కేంద్రానివే. చివరకు కేసీఆర్ కు బ్రోకర్ కమీషన్ కూడా కేంద్రమే ఇస్తోంది. ఇవన్నీ చెబుతుంటే నాపై కక్ష కట్టి నాపై దాడులు చేయించిండు. కేసులు పెట్టిండు. జైలుకు పంపిండు. అయినా భయపడకుండా మీ కోసం జైలుకు పోయిన.." అని బండి సంజయ్ అన్నారు.
ఇక్కడ ఎమ్మెల్యే మీకు ఎన్ని ఇండ్లు ఇచ్చారో చెప్పాలి..? అని ఆయన ప్రశ్నించారు. ఎంతమందికి రేషన్ కార్డులిచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్లకే పరిమితమై ప్రజలను గాలికొదిలేశాడని ఫైర్ అయ్యారు. ఇక్కడ రోడ్లకు తాను పైసలు తీసుకొస్తా.. ప్రతిపాదనలు పంపాలని చెబితే.. కనీసం పట్టించుకోకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే వాళ్లు మళ్లీ పోయేది బీఆర్ఎస్‌లోకేనని అన్నారు. ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌కు ఓట్లేస్తే అవన్ని మురిగిపోయినట్లే.. మానకొండూరులో గల్లీగల్లీపై అవగాహన ఉందన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని లూటీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆ మూడు పార్టీలను బొందపెట్టాలని కోరారు. పొరపాటున బీఆర్ఎస్‌ను గెలిపిస్తే ప్రజల రక్తం తాగేందుకు కూడా వెనుకాడరని గుర్తుంచుకోవాలని అన్నారు.
Also Read: World Cup 2023 Semifinal Teams: పాక్ వర్సెస్ ఆఫ్ఘన్ వర్సెస్ కివీస్ 4వ సెమీస్ ఎవరిది
Also Read: NBK109: గొడ్డలికి కళ్ళజోడు.. మన బాలయ్య కు మరో బ్లాక్ బస్టర్ షురూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి