BRS FELXI: పాకిస్తాన్‌కు మద్దతుగా బీఆర్ఎస్ ప్లెక్సీలు? చిక్కుల్లో సీఎం కేసీఆర్.. రగలిపోతున్న బీజేపీ
BRS FELXI: బీఆర్ఎస్ ను స్వాగతిస్తూ హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ నేతలు భారీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సోమాజిగూడ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్లెక్సీ దుమారం రేపుతోంది
BRS FELXI: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి బీజేపీ నేతలకు, నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. గులాబీ బాస్ పై కమలనాధులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. దేశ ద్రోహి అంటూ మండిపోతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెట్టిన కేసీఆర్.. ఇండియా మ్యా ప్ కు సంబంధించిన విషయంలో వివాదంలో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
వివరాల్లోకి వెళితే విజయదశమి రోజున జాతీయ పార్టీ పేరు ప్రకటించారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ను స్వాగతిస్తూ హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ నేతలు భారీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సోమాజిగూడ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్లెక్సీ దుమారం రేపుతోంది. దానం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దేశంలో ఎంత మంది ఉన్నా కేసీఆర్ లాంటి ఒక ఆలోచన పరుడు ఉంటే చాలు అని రాశారు. భారతదేశ చిత్రపటంలో సీఎం కేసీఆర్ ఫోటో పెట్టారు.
బీఆర్ఎస్ కు మద్దతుగా దానం నాగేందర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఇండియా మ్యాప్ ను తప్పుగా ప్రింట్ చేశారు. గుజరాత్, కాశ్మీర్ భూభాగాలను తప్పుగా ముద్రించారు. దీంతో ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గంటల్లోనే అవి వైరల్ గా మారాయి. కేసీఆర్ ఫోటోతో ముద్రించిన ఇండియా మ్యాపులో కశ్మీర్ భూభాగాన్ని తప్పుగా చూపడంపై కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.ఇండియా, చైనా బోర్డర్ గురించి గొప్పగొప్ప మాటలు చెప్పేవారు.. ఇండియా మ్యాపును ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ ఫ్లెక్సీపై ఓ నెటిజన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రింట్ చేయించిన ఇండియా మ్యాప్ తప్పుగా ఉందన్నారు. ఇది మన రాజ్యాంగాన్ని, భారత సమగ్రతను అవమానించడమేనని పైరయ్యారు. పాకిస్థాన్ ఆక్రమించిన కాశ్మీర్(పీవోకేను ) ను మ్యాప్ నుండి తీసేశారంటే .. కేసీఆర్ పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచినట్లు అర్ధమవుతుందన్నారు. పాకిస్తాన్ కోసం ప్రచారం చేసేందుకే ఈ ఈ ఫ్లెక్సీ ముద్రించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో చేయాలని ప్రయత్నించిన నిజాం రాజు వారసత్వాన్ని కేసీఆర్ అనుసరిస్తున్నారా అని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం వెనుక ఉద్దేశం ఇదేనా? అని నిలదీస్తూ ఎంపీ అర్వింద్ ట్విట్ చేశారు.
Read also: Munugode Bypoll: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జంప్.. మునుగోడులో రేవంత్ రెడ్డికి సవాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook