Nizamabad MLC Bypoll 2020: భారీ మెజార్టీతో కవిత విజయకేతనం
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కవిత విజయం (Kavitha wins Nizamabad MLC election) సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు భారీ మెజార్టీ (Kavitha majority in MLC Election) లభించింది.
Nizamabad MLC Election Results | నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అభ్యర్థి కవిత విజయం (Kavitha wins in MLC Election) సాధించారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఫలితం తొలి రౌండ్‌లోనే తేలిపోయింది. సీఎం కేసీఆర్ ఆశించినట్లుగా మాజీ ఎంపీ కవిత భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.
మొత్తం 823 ఓట్లు పోలవ్వగా, అందులో 10 ఓట్లు చెల్లలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు (Kavitha majority in MLC Election) రాగా, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకి 56 సీట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్‌రెడ్డికి 29 ఓట్లు వచ్చాయి. కాసేపట్లో అధికారులు కవితకు ఎమ్మెల్సీ గెలుపు ధృవీకరణ పత్రం అందజేయనున్నారు.
Also Read : COVID-19 Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత గెలుపు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ చేతుల మీదుగా అందుకున్నారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో తనకు సహకరించి గెలిపించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ కవిత హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Bussa Krishna Death: డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe