Bussa Krishna Death: డొనాల్డ్ ట్రంప్‌ వీరాభిమాని మృతి

డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని బుస్సా కృష్ణ (38) గుండెపోటుతో (Bussa Krishna a die-hard fan of Donald Trump) మృతి చెందాడు. తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ ఆదివారం తుదిశ్వాస విడిచాడు (Bussa Krishna died of cardiac arrest).

Last Updated : Oct 12, 2020, 07:44 AM IST
Bussa Krishna Death: డొనాల్డ్ ట్రంప్‌ వీరాభిమాని మృతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని బుస్సా కృష్ణ (38) గుండెపోటుతో (Bussa Krishna a die-hard fan of Donald Trump) మృతి చెందాడు. తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ ఆదివారం తుదిశ్వాస విడిచాడు (Bussa Krishna died of cardiac arrest). మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో బంధువుల ఇంట్లో టీ తాగుతుండగా ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కృష్ణ అప్పటికే చనిపోయాడని (Bussa Krishna Death News) నిర్ధారించారు.

అగ్రరాజ్యం అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వీరాభిమానిగా బుస్సా కృష్ణకు స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. నాలుగేళ్ల కిందట లక్షన్నర వ్యయంతో తన ఇంటి ఆవరణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విగ్రహం ఏర్పాటు చేయించాడు. రోజూ ప్రత్యేక పూజలతోపాటు ఏటా ట్రంప్‌ పుట్టినరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవాడు కృష్ణ. లాక్‌డౌన్, కరోనా వ్యాప్తికి ముందు జాతీయ మీడియాకు సైతం ఈయన ట్రంప్ భక్తి తెలియడంతో కథనాలు వైరల్ అయ్యాయి. దీంతో తాజాగా కృష్ణ చనిపోవడం (Donald Trump fan Bussa Krishna dies of cardiac arrest)తో నివాళి అర్పిస్తున్నారు.

ఇటీవల ట్రంప్ దంపతులు కరోనా బారిన పడ్డారని తెలిసినప్పటి నుంచీ కృష్ణ ఆందోళన చెందుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. మనస్తాపం చెందిన కృష్ణ అప్పటినుంచీ ఆహారం సరిగా తీసుకోవడం లేదని, ట్రంప్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసేవాడని వెల్లడించారు. ట్రంప్ కోసం ప్రతి శుక్రవారం ఉపవాసం సైతం ఉంటాడని కుటుంబసభ్యులు వివరించారు. ట్రంప్ అనారోగ్య వార్తనే కృష్ణను తమకు దూరం చేసిందని వారు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News