COVID-19 Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కాస్త తగ్గుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు గత వారం ఒక్క రోజు కేసుల కన్నా తక్కువగా నమోదయ్యాయి. 1,021 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana)‌‌గా నిర్ధారించారు.

Last Updated : Oct 12, 2020, 12:11 PM IST
  • తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుతోంది
  • తాజాగా కరోనా కేసులు గత వారం ఒక్క రోజు కేసుల కన్నా తక్కువగా నమోదయ్యాయి
  • ఆదివారం రాత్రి 8 వరకు 1,021 శాంపిల్స్ కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారించారు
COVID-19 Cases: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం

తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి కాస్త తగ్గుతోంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు గత వారం ఒక్క రోజు కేసుల కన్నా తక్కువగా నమోదయ్యాయి. తెలంగాణలో ఆదివారం రాత్రి రాత్రి 8గంటల వరకు 30,210 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,021 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana)‌‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,13,084కి చేరింది. 

అదే సమయంలో గడిచిన 24 గంటల్లో.. కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 1,228కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కరోనాపై హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారం ఒక్క రోజే 2,214 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,87,342 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 24,514 యాక్టివ్‌ కేసులుండగా.. అందులో 20,036 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

కాగా, అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 228 కరోనా పాజిటివ్ కేసులు (GHMC COVID19 Positive Cases) నమోదయ్యాయి. GHMC తర్వాత జిల్లాలవారీగా చూస్తే.. మేడ్చల్ మల్కాజిగిరిలో 84, రంగారెడ్డిలో 68, కరీంనగర్ 67, నల్లగొండ 46 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 35,77,261 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News