Munugode Bypoll:   తెలంగాణ కాంగ్రెస్ లో మునుగోడు ఉప ఎన్నిక సెగలు రేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, మునుగోడు ఉప ఎన్నికపై గాంధీభవన్ లో పార్టీ కీలక నేత కేణు వేణుగోపాల్ నిర్వహించిన సమావేశం హాట్ హాట్ గా సాగిందని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోకపోతే  మార్చేస్తామని రేవంత్ ను హెచ్చరించారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారన్న కేసీ..
మునుగోడులో సీరియస్ గా ఎందుకు పనిచేయడం నిలదీశారని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంచార్జిలను కలుపుకొని పనిచేయించే బాధ్యత మాణిక్యం ఠాగూర్ తో పాటు రేవంత్ రెడ్డిపైనే ఉందని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారట. ఆ బాధ్యతలు ఎందుకు తీసుకోవడం లేదని సూటి ప్రశ్నించారట. మండల,గ్రామ స్థాయిలో ఇంచార్జిగా ఉన్నవాళ్లు పనిచేయకుంటే మార్చేయాలని ఆదేశించారని చెబుతున్నారు, భారత్ జోడో యాత్ర,మునుగోడు ఉప ఎన్నిక ఒకేసారి ఉన్నాయని.. అసలు ప్రిపరేషనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.  పబ్లిసిటీ చెయ్యడంలో నువ్వు ఎక్స్పర్టువు కదా … బ్రాండింగ్ చేసుకోవడంలో నువ్వు దిట్ట కదా.. కానీ, భారత్ జోడో యాత్రలో ఎందుకు వెనుక పడ్డావు అంటూ రేవంత్ పై వేణుగోపాల్ సీరియస్ అయ్యారని అంటున్నారు. భారత్ జోడో యాత్ర ప్రచారమే లేదు.. ఎక్కడా హోర్డింగులే లేవు మొత్తం నీ క్యాంపెయినేనా అని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారని తెలుస్తోంది.


మునుగోడు టికెట్ విషయంలో రేవంత్ రెడ్డిన సూచించిన వ్యక్తిని కాదని పాల్వాయి స్రవంతి పేరు సూచించారు సీనియర్ నేతలు. వ్యాపారవేత్త చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని రేవంత్ భావించారు. కోమటిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే చండూరులో నిర్వహించిన రేవంత్ సభ ఖర్చులన్ని కృష్ణారెడ్డే భరించారు. అయితే సీనియర్ల సూచనతో స్రవంతికి టికెట్ దక్కింది. మునుగోడులో నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలో ప్రచారం చేసిన రేవంత్.. తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశారు. భారత్ జోడో యాత్ర ఏర్పాట్లలో ఉన్నారు. అయితే మునుగోడు ఖర్చు విషయంలో రేవంత్ రెడ్డి చేతులెత్తేశారనే చర్చ సాగుతోంది.  పీసీసీ నుంచి రూపాయి కూడా ఇవ్వలేమని,  పార్టీ ఫండ్​ రాదంటూ అభ్యర్థి స్రవంతికి తేల్చి చెప్పారని తెలుస్తోంది. . తాను సొంతంగా ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పారని అంటున్నారు. ఉప ఎన్నికలో భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందనే తాను కృష్ణారెడ్డి పేరు సూచించినా.. సీనియర్లు వ్యతిరేకించారని.. ఇప్పుడు డబ్బులు లేవంటే తానేం చేస్తానని రేవంత్​ రెడ్డి అంటున్నారని సమాచారం. అందుకే ఆర్థిక అంశాల చుట్టూ వెళ్లకుండా కేవలం ప్రచారానికి రేవంత్ పరిమితం అవుతున్నారని తెలుస్తోంది.


మునుగోడులో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై పాల్వాయి స్రవంతి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.  ఈ విషయంలో కేసీ వేణుగోపాల్ సీరియస్ అయ్యారని అంటున్నారు. ఈ పరిణామాలతో మునుగోడు కాంగ్రెస్ లో ఏం జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook