తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి ఆపధార్మ ముఖ్యంత్రి కేసీఆర్ సవాల్ విసిరారు. నిజామాబాద్ ప్రజలు కరెంట్, నీళ్లకు ఇబ్బంది పడుతున్నారని ప్రధాని మోడీ ఆరోపిస్తున్నారు.. ప్రధాని ఓకే అంటే నిజామాబాద్ కే వస్తా.. బహిరంగ చర్చకు సిద్ధమా ? అంటూ ప్రధాని మోడీకి కేసీఆర్ సవాల్ విసిరారు.  ప్రధాని హోదాలో ఉండి ఇలా చౌకబారు విమర్శలు చేయడం మోడీకి తగదని కేసీఆర్ హితవు పలికారు. నీరు, కరెంట్ విషయంలో మోడీ చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని.. ఆయన మాటలు అబద్ధమైతే ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేయాలని కేసీఆర్ సవాల్ విసిరారు. 


ప్రధాని మోడీ నిజామాబాద్ సభలో మాట్లాడుతూ ఇంటింటికి నల్లా ఇస్తానని చెప్పి కేసీఆర్ ప్రజలకు మోసం చేశారని..టీఆర్ఎస్  పాలనలో నిజమాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారని విమర్శించారు. కనీసం ప్రజలకు నీళ్లు కరెంట్ ఇవ్వలేని కేసీఆర్ కు పాలించే హక్కులేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ ప్రచార సభలో పాల్గొన్న కేసీఆర్... ప్రధాని మోడీపై విమర్శలు సంధించిన ఈ రకంగా ఈ సమాధానమిచ్చి సవాల్ విసిరారు.