టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ఆపధార్మ ముఖ్యమంత్రి పాలకుర్తి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ గోదావరి నీటిని మళ్లించి ఇక్కడ సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ టీడీపీలు పరిష్కరించలేని కరెంట్ సమస్యను తాము అధికారంలోకి వచ్చి పరిష్కరించామన్నారు.వీటితో పాటు అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశామని..ప్రపంచమే ఆశ్చర్యపడే రైతు బంధు పథకాన్ని అమలు చేశామన్నారు. రైతు బంధు పథకంపై ఐక్యరాజ్యసమితి ఆరా తీసిందటే ఇది గొప్ప పథకమే ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే వితంతు ఫించన్ 2,016 ఇస్తాం..వికలాంగులకు 3,016..నిరుద్యోగులకు 3,016 ఇస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇఛ్చారు. గత ఎన్నికల్లో హామీ ఇవ్వన్పప్పటికీ కల్యాణ లక్ష్మీ, కంటి వెలుగు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం పెంచాం...అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది  సాధించాము. తెలివి తక్కువ కాంగ్రెస్ వాళ్లకు తమ ప్రభుత్వం విజయాలు కనిపించడం లేదన్నారు. మహాకూటమి మాయ కూటమి అని..దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కేసీఆర్ వ్యాఖ్యానించారు.


డబుల్ బెడ్ రూం లు పథకం విజయవంతంగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం పేరుతో కాంగ్రెస్ , టీడీపీ వాళ్లు 4 వేల కోట్లు అప్పుచేశారని..దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు. దీన్ని బయటపెట్టకుండా పథకం అమలు కావడం లేదని ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ వారు కట్టిన ఇళ్ళకంటే  ఏడు రెట్లు మంచిగా ఇళ్లు నిర్మించామన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రతిపక్షాల చేస్తున్న రాద్ధాంతాన్ని ఎవరూ నమ్మవద్దని ఈ సందర్భంగా కేసీఆర్  ప్రజలను కోరారు. పాలకుర్తి ప్రజలు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో దయాకర్ గెలిపించాలని కేసీఆర్ కోరారు.