నెహ్రూ కుటుంబంపై కేసీఆర్ తీవ్ర ఆరోపణలు
ఇల్లెందు టీఆర్ఎస్ ఆశీర్వద సభలో నెహ్రూ కుటుంబంపై కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఏ రాష్టానికి వెళ్ళినా స్థానిక నేతల గొప్పవాళ్ల పేర్లు ఉంటాయి..మన ఖర్మ ఏంటో కానీ ఇక్కడ ఏం ప్రారంభించినా ఏం చేసినా నెహ్రూ ఇందిగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లే ఉంటాయ్... ఎయిర్ పోర్టు దగ్గర నుంచి నీటి ప్రాజెక్టుల వరకు ఇవే పేర్లు కనిపిస్తున్నాయి. అంటే మనకు పేర్లు పెట్టడానికి ఇంకా ఎవరూ దిక్కేలేనట్లుగా ఉందని ఎద్దేవ చేశారు. మన కొమరం భీం, జయశంకర్..ఇలా గొప్ప గొప్ప నేతలు తెలంగాణలో ఎందరో ఉన్నారు. తెలంగాణ నేతల పేర్లు కాంగ్రెస్ వారు ఎందుకు పెట్టలేదని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశ్నించారు.
భద్రాది కొత్తగూడెం: ఇల్లెందు టీఆర్ఎస్ ఆశీర్వద సభలో నెహ్రూ కుటుంబంపై కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఏ రాష్టానికి వెళ్ళినా స్థానిక నేతల గొప్పవాళ్ల పేర్లు ఉంటాయి..మన ఖర్మ ఏంటో కానీ ఇక్కడ ఏం ప్రారంభించినా ఏం చేసినా నెహ్రూ ఇందిగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లే ఉంటాయ్... ఎయిర్ పోర్టు దగ్గర నుంచి నీటి ప్రాజెక్టుల వరకు ఇవే పేర్లు కనిపిస్తున్నాయి. అంటే మనకు పేర్లు పెట్టడానికి ఇంకా ఎవరూ దిక్కేలేనట్లుగా ఉందని ఎద్దేవ చేశారు. మన కొమరం భీం, జయశంకర్..ఇలా గొప్ప గొప్ప నేతలు తెలంగాణలో ఎందరో ఉన్నారు. తెలంగాణ నేతల పేర్లు కాంగ్రెస్ వారు ఎందుకు పెట్టలేదని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశ్నించారు.
అందుకే రాజీవ్, ఇందిరా పేర్లు మార్చాం
ప్రాజెక్టుల రీ డిజైన్ విషయంలో టీఆర్ఎస్ సర్కార్ పై రాహుల్ గాంధీ ఆరోపణలపై కేసీఆర్ స్పందించారు . రాహుల్ గాంధీకి భగవంతుడు తెలివి ఇవ్వలేదు.. ఆయన జోకర్ లా మాట్లాడుతున్నాడని కేసీఆర్ ఎద్దేవ చేశారు. కమిషన్ కోసం ప్రాజెక్టులను రీ డిజైన్ చేయాల్సిన ఖర్మ తమకు లేదన్నారు. కాంగ్రెస్ హాయంలో కట్టిన ఆయా ప్రాజెక్టులు రాష్ట్రప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని అందుకే వాటిని రీ డిజైన్ చేశామని వివరణ ఇచ్చారు. ప్రాజెక్టుల పేర్ల మార్పులపై కేసీఆర్ స్పందిస్తూ తెలంగాణ నేతలను గుర్తింపు ఇచ్చేందుకే రాజీవ్ సాగర్ , ఇందిరాసార్ కు పేర్లు మార్చి సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశామని కేసీఆర్ వివరించారు.