Revanth Reddy: `కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం`: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. మొదటి సారి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా నారాయణపేట నుంచి ప్రచారం ప్రారంభించాడు. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నారాయణపేటలో సోమవారం జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. 'జైలు పాలయిన తన కుమార్తె కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కయ్యారు. మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సహకరిస్తోంది' అని ఆరోపించారు.
Also Read: Wine Shops Close: తెలంగాణలో వైన్స్ దుకాణాలు బంద్.. ఇక్కడే ఒక మెలిక ఏమిటంటే?
అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ కలిసి పని చేశాయని రేవంత్ రెడ్డి తెలిపారు. పోటీ నుంచి తప్పుకుని డీకే అరుణ తన అల్లుడు బీఆర్‌ఎస్ పార్టీ గెలిపించేందుకు సహకరించారని ఆరోపణలు చేశారు. గద్వాల కోటలో కుట్రKCR Rajaiah Meet: కేసీఆర్‌కు బిగ్ బూస్ట్.. బీఆర్‌ఎస్‌లో తిరిగి చేరిన తాటికొండ రాజయ్య
ఐదు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీకి కేసీఆర్ సహకరిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవం మోదీ కాళ్ల వద్ద కేసీఆర్ తాకట్టు పెట్టారని వివరించారు. కవిత బెయిల్ కోసం తెలంగాణను తాకట్టు పెట్టాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఏకకాలంలో చేస్తా, వచ్చేసారి వడ్లకు రూ.500 బోనస్ ఇస్తానని వివరించారు. ఎన్నికల కోడ్ వచ్చిందని.. కోడ్ ముగిశాక వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని చెప్పారు. ఆగస్టు 15లోపు ముదిరాజ్‌లకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని ప్రకటించారు. వంద రోజుల్లో చాలా హామీలు అమలు చేశామని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter