తెలంగాణ ఎన్నికలు 2018: బీజేపీ చీఫ్ అమిత్షా కు కేసీఆర్ సవాల్
Telangana Elections 2018 : ఆదిలాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
ఆదిలాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీని టార్గెట్ చేస్తూ తెలంగాణ ఆపధార్మ సీఎం కేసీఆర్ విమర్శలు సంధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతల విమర్శలు అర్థరహితమని.. హాస్యాస్పదమన్నారు . రైతులు, మహిళలు, యవకుల సమస్యలపై బీజేపీ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. ..అసలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా కేసీఆర్ బీజేపీ చీఫ్ అమిత్ షాకు షవాల్ విసిరారు.. దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తోంది.. ఎక్కడైనా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చారా..రుణమాఫీ ఇక్కడైన చేశారా..వితంతువులకు, వృద్ధలుకు వెయ్యి ఫించన్ ఇచ్చారా ? అంటూ ప్రశ్నలు సంధించారు. వారి రాష్ట్రాల్లో చేయకుండా బీజేపీ అగ్రనేతలు ఇక్కడికి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరన్నారు. అమిత్ షాకు దమ్ముంటే తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కేసీఆర్ డిమాండ్ చేశారు.