Illicit Affair: మామతో కోడలి వివాహేతర సంబంధం.. కూతురికి తెలియడంతో ఎంతకి తెగించారంటే..
Woman kills daughter over illicit affair with father in law: మామతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ కన్న కూతురినే బలి తీసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
Woman kills daughter over illicit affair with father in law: ఖమ్మం జిల్లా బోనకల్లులో దారుణం వెలుగుచూసింది. మామతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. ఆ విషయం తన కూతురికి తెలిసిందని.. అతనితో కలిసి చిన్నారిని హతమార్చింది. హత్యానంతరం చిన్నారి ఫిట్స్‌తో చనిపోయినట్లు చిత్రీకరించేందుకు విఫల ప్రయత్నం చేశారు. చివరకు పోస్టుమార్టమ్ రిపోర్టులో అసలు విషయం బయటపడటంతో నిందితులిద్దరినీ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. బోనకల్లు మండలానికి చెందిన సునీత అనే మహిళ తన భర్త, 12 ఏళ్ల కూతురితో కలిసి స్థానికంగా నివసిస్తోంది. కొన్నాళ్లుగా సునీతకు ఆమె మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇటీవల ఓరోజు ఇద్దరు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో సునీత కూతురు గమనించింది. దీంతో నరసింహారావు, సునీత భయపడిపోయారు. ఎక్కడ ఆ విషయం అందరికీ చెబుతుందోనని ఆందోళన చెందారు. చివరకు చిన్నారిని లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 9న చున్నీతో బాలిక కాళ్లు, చేతులు కట్టేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆపై బాలికకు ఫిట్స్ వచ్చిందని చెబుతూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆపై చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టమ్ చేయాలని వైద్యులు చెప్పగా.. నరసింహారావు, సునీత అందుకు ఒప్పుకోలేదు. చిన్నపిల్లను పోస్టుమార్టమ్ చేయడం తాము తట్టుకోలేమని మొసలి కన్నీళ్లు కార్చారు. కానీ వైద్యులు అవన్నీ కుదరవని చెప్పి పోస్టుమార్టమ్ నిర్వహించడంతో... బాలికను గొంతు నులిమి హత్య చేసినట్లుగా వెల్లడైంది. దీంతో సునీతతో వివాహేతర సంబంధం ఉన్న ఓ యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు నరసింహారావు మరో కట్టు కథ అల్లాడు. కానీ పోలీసుల విచారణలో సునీత, నరసింహారావు నేరం అంగీకరించక తప్పలేదు. దీంతో ఈ ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది.
Also Read: Tollywood Films: వేసవిలో వినోదపు తుఫాన్.. టాలీవుడ్‌లో వరుసగా విడుదల అవుతున్న పెద్ద సినిమాలు ఇవే!
Also Read: Bappi Lahiri Telugu Songs: చిరంజీవికి మంచి హిట్స్ ఇచ్చిన బప్పి లాహిరి.. తెలుగు టాప్ సాంగ్స్ ఇవే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook