Kishan Reddy: దేశంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎంపిక కోసం కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సంస్థగత ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరడంతో కొత్త ఏడాదిలో జాతీయ అధ్యక్షుడి నియామకం పూర్తి కానుంది. ఈసారి అధ్యక్ష రేసులో చాలా మంది లీడర్లు ఉన్నప్పటికీ.. కమలనాథులు మాత్రం దక్షిణాదికి చెందిన సీనియర్‌ నేతకు ప్రెసిడెంట్‌ పదవి ఇవ్వాలని డిసైడ్‌ అయినట్టు ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.. అందులోనూ తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వైపు పార్టీ పెద్దలు మొగ్గుచూపుతున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.. అయితే కిషన్‌ రెడ్డికి ప్రెసిడెంట్‌ పదవి విషయంలో అటు ఆర్‌ఎస్‌ఎస్‌కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో సీనియర్‌ బీజేపీ నేతగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి.. మోడీ 3.0 లో మంత్రిగా ప్రమోషన్‌ పొందారు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో అనేకమార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కిషన్‌ రెడ్డి.. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీగా విజయం సాధించారు. అక్కడే కిషన్‌ రెడ్డి పొలిటికల్‌ లైఫ్‌ మరో మలుపు తీసుకుంది. పార్టీలో సీనియర్‌నేత కావడంతో ప్రధానీ మోడీ కిషన్‌ రెడ్డికి ప్రమోషన్‌ ఇచ్చారు. తన మంత్రివర్గంలోకి కిషన్‌ రెడ్డికి తీసుకుని తెలంగాణకు తాము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చెప్పేశారు. అంతేకాదు అటు రాష్ట్ర శాఖ బాధ్యతలు కూడా కిషన్ రెడ్డికే అప్పగించారు. దాంతో కిషన్‌ రెడ్డి జోడు పదవులను చక్కబెతున్నారు. అయితే క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా మచ్చలేని లేని నేతగా కిషన్‌ రెడ్డి గుర్తింపు పొందారు. ఇప్పుడే ఈ అంశాలన్నీ కిషన్‌ రెడ్డికి అనుకూలంగా మారాయని సొంత పార్టీ లీడర్లే చెబుతున్నారు.


ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ తెలంగాణలో అధికారం దిశగా పావులు కదిపింది. కానీ కమలం పెద్దలు ఊహించిన స్థాయిలో సీట్లు రాలేదు.. కేవలం 8 సీట్లకే కమలం పార్టీ పరిమితం అయ్యింది. కానీ పార్టీకి మాత్రం ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అంచనాలన్నీ తారుమారు చేస్తూ 8 మంది ఎంపీలు గెలవడంతో.. కమలం పార్టీలో సరికొత్త ఆశలు మరోసారి చిగురించాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో కాస్తా కష్టపడితే.. పవర్‌లోకి రావడం పక్కా అని కాషాయపెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి జాతీయ స్థాయిలో పదవి ఇచ్చేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలకు గతంలోనే జాతీయ అధ్యక్ష పదవులు దక్కాయి. గతంలో బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత వెంకయ్య నాయుడు జాతీయ అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.


ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. ఆయన పదవి కాలం ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం నడ్డా కేంద్రమంత్రిగా ఉన్నారు. దాంతో కొత్త అధ్యక్షుడిగా కొత్త నేతకు అవకాశం కల్పించాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి వీరవిదేయుడిగా ఉన్న నేతల్లో కిషన్‌ రెడ్డిఒకరు. ఆయనకు మోడీ అన్న.. అమిత్‌ షా అన్న ఎనలేని గౌరవం.. అందుకే ఆయన్ను వెతుకుంటూ పదవులు వస్తున్నాయని సొంత పార్టీ లీడర్లే చెబుతున్నారు. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవికి కూడా కిషన్‌ రెడ్డికి పోటీలో ఎవరు లేరని అంటున్నారు. అటు ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా కిషన్‌ రెడ్డికి నేషనల్‌ ప్రెసిడెంట్‌ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.


తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కిషన్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఢిల్లీలోని కిషన్‌రెడ్డి అధికారిక నివాసంలో కిషన్‌ రెడ్డి గంటపాటు చర్చలు జరిపారు. దాంతో కిషన్‌ రెడ్డికి జాతీయ అధ్యక్ష పదవి ఖాయమైపోయిందని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై నడ్డా కిషన్‌ రెడ్డితో చర్చలు జరిపారని.. త్వరలోనే అధికారిన ప్రకటన వచ్చే చాన్స్ ఉందని చెబుతున్నారు. మొత్తంగా కిషన్‌ రెడ్డికి లైన్‌ క్లియర్‌ అయినట్టేనని ఢిల్లీ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి..


Also Read: Kadapa Mayor: మళ్లీ మేయర్ వర్సెస్‌ టీడీపీ ఎమ్మెల్యే మధ్య రచ్చరచ్చ.. 'కడప'లో కుర్చీల లొల్లి


Also Read: DK Aruna: రేవంత్ అడ్డాలో డీకే అరుణ హల్‌చల్‌.. లగచర్ల రైతులకు పరామర్శ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.