Kishan Reddy On Revanth Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కష్టపడ్డామని.. అయినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయి నుంచి మండల, బూత్ స్థాయి వరకు సమీక్ష జరిపి పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు తమ తప్పులను సరిదిద్దుకుంటామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తరువాత ఆయన సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డబ్బులను పంచి గెలవాలని చూశాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న పరిస్థితి ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లేదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని బీజేపీ తీసుకుంది. మధ్యప్రదేశ్‌లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చారు. కామారెడ్డిలో ఒక ముఖ్యమంత్రి, ఇంకొకరు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డిని ఓడించి రికార్డు సృష్టించాం.. కామారెడ్డి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి గారికి అభినందనలు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాం.. ప్రస్తుతం వచ్చిన 14 శాతం నుంచి ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి.


ప్రచారానికి వెళ్లిన సమయంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఓటర్లు కూడా.. మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తామో తెలియదు.. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తగ్గేదే లేదు.. ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనా ఇప్పటి నుంచే దృష్టి పెడతాం. మేము గెలిచింది 8 స్థానాలే కావచ్చు.. కానీ మాకు 80 మంది బలాన్ని ఇచ్చారు. భవిష్యత్‌లో మరింత కసితో పనిచేస్తాం. క్రియాశీల ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర పోషిస్తాం.. ప్రజల పక్షాన నిలబడుతాం. మా పోరాటం కాంగ్రెస్‌కు లాభం చేకూర్చింది.. అయినా పోరాటం చేస్తూనే ఉంటాం. మా ఓటమిపై అన్ని స్థాయిల్లో సమీక్ష నిర్వహించుకుని ముందుకు వెళతాం.." అని కిషన్ రెడ్డి అన్నారు.


తాను ఢిల్లీకి వెళ్తున్నానని.. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవ్వడంపై.. ఈ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళిపై వివరిస్తానని చెప్పారు. కర్ణాటక ఎన్నికలు, తమపై బురద జల్లడం, ఇతర కారణాల వల్ల ఓడిపోయామని.. ఇతర కారణాలపై కూడా విశ్లేషణ చేసుకుంటామన్నారు. తమ ఓటమిపై అన్ని స్థాయిల్లో సమీక్ష నిర్వహించుకుని ముందుకు వెళతామన్నారు. 


Also Read:  Cow Kiss Black King Cobra: బ్లాక్‌ కింగ్‌ కోబ్రాను నాలుకతో తాకిన ఆవు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..


Also Read:  చిన్న పొరపాట్లు సాధారణమే.. కావాలనే నాపై బురద చల్లుతున్నారు : సురేష్ కొండేటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook