తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ( Mahabubnagar ) జిల్లా దేవరకద్ర ( Devarakadra ) మండలంలో ఉన్న కోయిల్ సాగర్ డ్యామ్ ( Koil Sagar Dam ) గేట్లు ఇటీవలే తెరిచారు. దీంతో అక్కడ సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. కోవిడ్-19 ( Covid-19 ) పరిస్థితులు, తీవ్రస్థాయిలో ఉన్న వర్షాల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా సందర్శకులను కట్టడి చేసేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్.పి. రెమా రాజేశ్వరి గారి ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని వాగులు, ప్రవాహాలు ఇతర ప్రమాదకర ప్రదేశాలలో పోలీసు శాఖ గట్టి నిఘా పెట్టింది. Prabhas: ఆదిపురుషుడి పాత్ర చేయడం గర్వకారణం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రధాన పర్యటక ప్రాంతాల్లో కోయిల్ సాగర్ కూడా ఒకటి కావడంతో పర్యటకులు తరలి వస్తున్నారు. కోయిల్ సాగర్ దగ్గర ఉన్న  కోయిల్  కొండ వద్ద గుడిలో కొలువై ఉన్న వీరభద్రుని గుడికి భక్తులు తాకిడి పెరిగింది. ప్రతీ సంవత్సరం ఇక్కడ కోయిల్ సాగర్ గ్రామస్థులు వేడుకలు నిర్వహిస్తుంటారు.



Dhoni : ధోనీతో మంచి దోస్తీ ఉన్న సెలబ్రిటీలు వీరే


Fake Smile: నకిలీ నవ్వు వల్ల ఎన్ని నష్టాలో తెలుసా ?