CM Revanth Reddy Meet With Komatireddy Raj Gopal Reddy: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రెండంకెల సీట్లు సాధించాలని ప్రయత్నిస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు  ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా లోక‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ టైంలో పలు నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. భువనగిరి పార్లమెంట్‌పై ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు. భువనగిరి పార్లమెంట్‌కు ఇంఛార్జీగా రాజగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్‌ కుమార్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. రాజగోపాల్‌రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లిన నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Student Warn To Teacher: 'సార్‌ మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా'.. జవాబుపత్రంలో విద్యార్థి వార్నింగ్‌


అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రివ్యూ మీటింగ్ జరిగిందని.. తనకు ఇంఛార్జి బాధ్యతలు పార్టీ అప్పగించిందని తెలిపారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలని చర్చించామని.. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని చెప్పారు. చమాల కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందని.. పార్టీ ప్రచారం ఎలా ఉండాలనేది డిసైడ్ చేశామన్నారు. భువనగిరిలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందన్నారు. పోలింగ్ వరకు కార్యకర్తలు విరామం లేకుండా పని చేయాలని సూచించారు. 


ప్రతి నియోజకవర్గంలో ఈ నెల 18 వరకు ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మే మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడ బహిరంగ సభలకు ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. ఈ నెల 21న భువనగిరి నామినేషన్ వేసే రోజు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. 


భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామలా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కోమటి రెడ్డి బ్రదర్స్ తనను సొంత తమ్ముడిగా భావించి పని చేస్తున్నారని అన్నారు. తనను భువనగిరి ప్రజల కుటుంబ సభ్యుడిగా భావించి ఓటు వేయాలని కోరారు. భువనగిరి సమస్యల మీద పార్లమెంట్‌లో తన గళం వినిపిస్తానని అన్నారు.


Also Read: Balakrishna: టీడీపికీ ఊపు తెచ్చేందకు నందమూరి బాలకృష్ణ సైకిల్ రావాలి యాత్ర.. ఆ రోజు నుంచి మొదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook