Komatireddy Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన రాజీనామా దెబ్బకు ఇన్నేళ్లపాటు ఫామ్ హౌజ్‌లో పండుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా మునుగోడుకు వచ్చిండు అని ఎద్దేవా చేశారు. మాటలతో బురిడి కొట్టించి జనాన్ని నమ్మించే తెలివితేటలు కొన్ని రోజుల వరకే నడుస్తాయని..  ఆ తర్వాత ఎవ్వరూ మీ మాటలను నమ్మరు అని అధికార పార్టీ నేతలకు హితవు పలికారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపి క్షిపణులతో నిండిన ఒక యుద్ధ నౌక
బిజెపిని ఒక యుద్ధ నౌకతో పోల్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ని ఒక యుద్ధ క్షపణితో అభివర్ణించారు. ఒక బండి సంజయ్, రఘునందన్ రావు, ఒక రాజాసింగ్ లాంటి క్షిపణలు కొలువుతీరిన యుద్ధ నౌకగా భారతీయ జనతా పార్టీని కొనియాడారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అహంకారం ఎక్కువై తనను ప్రశ్నించే వాళ్లు ప్రతిపక్షంలో ఉండొద్దనే ఉద్దేశంతో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని టీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్నాడు. అప్పటి నుంచే కేసీఆర్ని గద్దె దించి.. టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. 


గత 8 ఏళ్లలో తెలంగాణలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని సంస్థ నారాయణపూర్‌లో ఇండ్లు రానప్పుడు, రోడ్లు రానప్పుడు ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎవ్వరి కోసం వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. వెయ్యి మంది పిల్లలు ప్రాణ త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. 


బూర నర్సయ్య గౌడ్ గురించి..
తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించడానికి బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, వివేక్ వెంకటస్వామిలు పోరాటం చేస్తున్నారు. ఈమధ్యే భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా బీజేపి జరుపుతున్న పోరాటానికి మద్దతుగా బీజేపీతో కలిసి వచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపి చురుకుగా పనిచేస్తోందన్నారు. 


ఒక్క రూపాయి కూడా ఇవ్వలే నువ్వు
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం మూడున్నర ఏళ్ల పాటు అసెంబ్లీలో కొట్లాడితే ఒక రూపాయి కూడా ఇవ్వలే నువ్వు. అలాంటిది ఇప్పుడిలా మునుగోడులో ఉప ఎన్నిక రావడంతో మునుగోడుపై ప్రేమ కురిపిస్తున్నావు అని మండిపడ్డారు. ఉప ఎన్నిక వచ్చిన తర్వాత వచ్చి గట్టుప్పల్‌లో మాజీ సర్పంచ్‌ అన్నా రా అన్నా రా అని బతిలాడుతున్నావ్ అని ఎద్దేవా చేశారు. అప్పట్ల తెలంగాణ కోసం నువ్వు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లినట్టే.. ఇప్పుడు నిన్ను బొంద పెట్టడానికే రాజీనామా చేస్తే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. మునుగోడులో తనను ఓడకొట్టడానికి ఇక్కడికి వచ్చి మునుగోడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలలో ఎవరైనా వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వద్ద నిధులు తీసుకొచ్చే దమ్ముందా అని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.


Also Read : Harish Rao Meeting: మునుగోడు టీఆర్ఎస్ నేతలతో మంత్రి హరీశ్ రావు కీలక సమావేశం


Also Read : Komati Reddy Venkat Reddy: బిగ్ బ్రేకింగ్.. కోమటిరెడ్డి ఆడియో లీక్.. మునుగోడులో కలకలం


Also Read : Budida Bikshamaiah Goud: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై బిక్షమయ్య గౌడ్‌కి మరీ అంత కోపం ఎందుకంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి