Harish Rao Meeting: మునుగోడు టీఆర్ఎస్ నేతలతో మంత్రి హరీశ్ రావు కీలక సమావేశం

Harish Rao Meeting with Munugode TRS workers: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం తన స్వలాభం కోసమే రాజీనామా చేశాడని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అంతేకాదు.. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో, ఎందుకు మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో రాజగోపాల్ రెడ్డికే తెలియదు అని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

Written by - Pavan | Last Updated : Oct 22, 2022, 05:22 AM IST
  • ఇన్నాళ్లుగా ఉన్నది కోమటిరెడ్డి బ్రదర్సే కదా..
  • ఆ 18 వేల కోట్ల కోసమే ఇదంతా..
  • ముగ్గురు పోయి నలుగురు ఎమ్మెల్యేలు అవుతారు.. అంతే..
Harish Rao Meeting: మునుగోడు టీఆర్ఎస్ నేతలతో మంత్రి హరీశ్ రావు కీలక సమావేశం

Harish Rao Meeting with Munugode TRS workers: మునుగోడు ఉప ఎన్నిక మునుగోడు ప్రజల కంటే ఒక వ్యక్తిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే ఎక్కువ లాభం చేకూర్చుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్వయంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి బిజెపిలో ఉన్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయమని అంటున్నాడు. ఇంతకంటే దిగజారుడు, దివాలాకోరు రాజకీయం మరొకటి ఉంటుందా అని కోమటిరెడ్డి బ్రదర్స్ వైఖరిని మంత్రి హరీశ్ రావు నిలదీశారు. 

ఇన్నాళ్లుగా ఉన్నది కోమటిరెడ్డి బ్రదర్సే కదా..
70 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన గత పాలకుల నిర్లక్ష్యం పుణ్యమే ఉమ్మడి నల్గొండ జిల్లాలో, మునుగోడులో ఈ ఫ్లోరైడ్ సమస్య. అలాంటి ఫ్లోరైడ్ సమస్యను మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధి చేసిన తాగు నీరు అందించి తరిమికొట్టిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి అన్నారు. 

ఆ 18 వేల కోట్ల కోసమే ఇదంతా..
18 వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థం, ఆయన సొంత ప్రయోజనాల కోసమే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మునుగోడులో ఇప్పుడు మనం చూస్తున్నదంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ 18 వేల కోట్ల కోసం ఆశపడటం వల్ల జరుగుతున్నదే చూస్తున్నాం అని అన్నారు.

ముగ్గురు పోయి నలుగురు ఎమ్మెల్యేలు అవుతారు.. అంతే.. 
మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేయండి అని మంత్రి హరీశ్ రావు ఓటర్లకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని.. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే తెలంగాణలో ముగ్గురు బీజేపి ఎమ్మెల్యేలు కాస్తా నలుగురు ఎమ్మెల్యేలు అవుతారు తప్ప ఇంకెలాంటి లాభం లేదని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

Also Read : Pawan Kalyan: బిగ్ ట్విస్ట్.. దాసోజు శ్రవణ్‌కు పవన్ కళ్యాణ్ సపోర్ట్.. బీజేపీ-జనసేన కటీఫ్ కన్ఫార్మ్..?

Also Read : TRS OPERATION AKARSH: నేరుగా గ్రౌండ్ లోకి దిగిన సీఎం కేసీఆర్.. కారెక్కనున్న ఉద్యమ లీడర్లు?

Also Read : Revanth Reddy: తెలంగాణ పీసీసీకి త్వరలో కొత్త చీఫ్? రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News