Komatireddy Rajagopal Reddy News: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ ఇద్దరికి కోమటిరెడ్డి బ్రదర్స్ అనే పేరున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ విషయంలోనైనా అన్నాదమ్ముళ్లిద్దరూ కలిసే అడుగేస్తారని ఆ ఇద్దరి గురించి తెలిసిన వాళ్ల మాట. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసే ఒక్క విషయంలో తప్ప మరే ఇతర విషయాల్లోనైనా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట, రాజగోపాల్ రెడ్డి మాట ఒక్కటేననే అభిప్రాయం కూడా ఉంది. కానీ తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపైనే తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుట్ర చేశారా అనే సందేహం కలగకమానదు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై షబ్బీర్ అలీ సంచలన ఆరోపణలు
అవును.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ.. తెలంగాణ పీసీసీ చీఫ్ పోస్ట్ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాలు చేశారని అన్నారు. స్వయంగా తన వద్దకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వవద్దని అన్నారని షబ్బీర్ అలీ బాంబు పేల్చారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డికి, లేదంటే తనకు అవకాశం కల్పించాలని రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారని.. రాజగోపాల్ రెడ్డి నా ఇంటికి వచ్చి మరీ ఈ ప్రపోజల్ పెట్టాలని అడిగారని షబ్బీర్ అలీ తెలిపారు. రాజగోపాల్ రెడ్డి ప్రతిపాదనకు నేనే ప్రత్యక్ష సాక్షిని అని చెప్పుకొచ్చిన షబ్బీర్ అలీ.. దమ్ముంటే ఇది అబద్ధమని ఒట్టేసి చెప్పాలని డిమాండ్ చేశారు. సరిగ్గా షబ్బీర్ అలీ చేసిన ఈ వ్యాఖ్యలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించి కుట్ర చేశారా అనే సందేహాలకు తావిస్తున్నాయి. 


బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పుల నుంచి బయటపడటానికే...
పీసీసీ చీఫ్ పదవి కోసం రాజకీయాలు చేసిన నీకు కాంగ్రెస్ పార్టీని కానీ లేదా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని కానీ విమర్శించే స్థాయి లేదంటూ రాజగోపాల్ రెడ్డిపై షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ పాలు తాగి పార్టీకే వెన్నుపోటు పొడుస్తావా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్ను బొంద పెడతారంటూ హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూనే అమిత్ షాను చాలాసార్లు కలిశాను అని రాజగోపాల్ రెడ్డినే స్వయంగా చెప్పారు. కాంట్రాక్టర్‌గా అనేక వ్యాపారాలు చేస్తోన్న రాజగోపాల్ రెడ్డి బ్యాంకుల వద్ద కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. బ్యాంకులకు డీఫాల్టర్ అయ్యాడు. ఆ ఇబ్బందుల నుండి బయటిపడి వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసనే రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలిశారు అని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. 


మునుగోడు వెళ్లినవా ?
మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచాక ఏరోజైనా మళ్లీ నియోజకవర్గానికి వెళ్లినవా అంటూ రాజగోపాల్ రెడ్డికి షబ్బీర్ అలీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేగా గెలిచాకా మునుగోడు ముఖం చూడని రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యలు ఈరోజు గుర్తుకొచ్చాయా అని నిలదీశారు. షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలు రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేవిగా ఉన్నాయి. మరి షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే.


Also Read : Big Debate With Bharath: బిగ్ డిబేట్ విత్ భరత్.. సంచలన విషయాలు వెల్లడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


Also Read : Rajgopal Reddy: రాజగోపాల్ రెడ్డికి కేసీఆర్ మంత్రిపదవి ఆఫర్? రాయబారం నడిపింది ఎవరు?


Also Read : Munugode By Election: మునుగోడులో ఎవరి బలం ఎంత.. ఉపఎన్నికలో ఏం జరగబోతోంది ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook