KRMB Issue: కృష్ణా ప్రాజెక్టుల అంశంపై తెలంగాణలో తీవ్ర రాజకీయ ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ పార్టీ 'ఛలో నల్లగొండ' బహిరంగ సభ చేపడుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశంలో కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై తీర్మానం ప్రవేశపెట్టింది. అకస్మాత్తుగా ఈ వివాదాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Elections: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ 'పంచ వ్యూహం'.. తెలంగాణవ్యాప్తంగా యాత్రలే యాత్రలు


అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన మూకుమ్మడి దాడిని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు తిప్పికొట్టారు. అసెంబ్లీ సమావేశంలో సోమవారం ప్రభుత్వం వర్సెస్‌ హరీశ్‌ రావు అన్నట్లు వాదనలు జరిగాయి. హరీశ్ రావు స్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో గులాబీ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం చేసిన ఆరోపణలు, విమర్శలను హరీశ్‌ రావు అదే స్థాయిలో తిప్పికొట్టారని గులాబీ దళం భావిస్తోంది. ఈ సందర్భంగా హరీశ్‌ రావుపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టారని కితాబిచ్చారు. ఈ మేరకు 'ఎక్స్‌' వేదికగా హరీశ్ రావుకు అభినందనలు చెప్పారు.

Also Read: Telangana: బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో భారీ షాక్‌.. రేవంత్‌ను కలిసిన బొంతు రామ్మోహన్‌


'తన అద్భుత ప్రసంగంతో అసెంబ్లీలో ముఖ్యమంత్రి, మంత్రులందరినీ ఒంటి చేత్తో హరీశ్‌ రావు ఎదుర్కొన్నారు. కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ అంశాలకు సంబంధించి కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారం, అబద్ధాలను తిప్పికొట్టారు. రేపటి చలో నల్లగొండ బహిరంగ సభకు హరీశ్ రావు సరైన టోన్‌ సెట్‌ చేశారు. కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని నల్లగొండ వేదికగా కేసీఆర్‌ తనదైన శైలిలో ఎండగడతారు' అని ట్వీట్‌ చేశారు.




కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను నదీ యాజమాన్య బోర్డుకు అప్పగింతపై వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. బోర్డుకు అప్పగించారని బీఆర్‌ఎస్‌ పార్టీ.. అప్పగించింది మీరే అని కాంగ్రెస్‌ ప్రభుత్వం పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా అసెంబ్లీలో 'కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణ బోర్డుకు అప్పగించాం' అని తీర్మానం చేశారు. ఈ తీర్మానం చర్చలో భాగంగా వాడీవేడి చర్చ జరిగింది. చివరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అంగీకారం తెలపడంతో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. కాగా ఇదే అంశంపై నల్లగొండ వేదికగా భారీ బహిరంగ సభ బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించనుంది. ఆ వేదిక ద్వారా కేఆర్‌ఎంబీ అంశంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక ప్రసంగం చేయనున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి